Suman Ray | ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుమన్ రే..
Suman Ray | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నియామకం చేపట్టింది. సుమన్ రేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా మంగళవారం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పటివరకు ఆయన మహారాష్ట్ర రీజినల్ డైరెక్టర్‌గా పనిచేశారు.
Suman Ray | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నియామకం చేపట్టింది. సుమన్ రేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా మంగళవారం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పటివరకు ఆయన మహారాష్ట్ర రీజినల్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈడీ హోదాలో సుమన్ రే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ), ప్రెమిసెస్ విభాగాలను పర్యవేక్షించనున్నారు. ఆర్బీఐలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న రే.. కరెన్సీ నిర్వహణ, ఆర్థిక అక్షరాస్యత, చెల్లింపులు–సెటిల్‌మెంట్ వ్యవస్థ, వినియోగదారుల విద్య–రక్షణ, మానవ వనరులు తదితర విభాగాల్లో పనిచేశారు. పశ్చిమ ప్రాంత లోకల్ బోర్డుకు కార్యదర్శిగానూ సేవలందించారు.
వరుసగా కీలక నియామకాలు
ఆర్బీఐ ఇటీవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయిలో వరుస నియామకాలు చేపడుతోంది. గత నెలలో మోనిషా చక్రవర్తిని ఈడీగా నియమించింది. ఆమెకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ విభాగం, ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ విభాగాల బాధ్యతలు అప్పగించింది. అంతకుముందు ఆమె డిపార్ట్‌మెంట్ ఆఫ్ సూపర్‌విజన్‌లో చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్‌చార్జిగా పనిచేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఆర్బీఐలో అనుభవం ఉన్న చక్రవర్తి.. పర్యవేక్షణ, విదేశీ మారకం, ప్రభుత్వ–బ్యాంకు ఖాతాల విభాగాల్లో పనిచేశారు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.
జులైలో రవి శంకర్‌ను కూడా ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. అప్పటివరకు ఆయన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌లో అడ్వైజర్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఈడీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ఆర్బీఐలో పనిచేసిన శంకర్.. కార్పొరేట్, బ్యాంకింగ్ గణాంకాలు, ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్, సెటిల్‌మెంట్ వ్యవస్థలు, రుణ నిర్వహణ, సర్వేలకు సంబంధించిన విభాగాల్లో సేవలందించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్






