Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం
Bandi Sanjay | కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయిస్తున్న ఎంపీ లాడ్స్ నిధులను వినియోగించుకోవడంలో పార్లమెంట్ సభ్యులు పూర్తిగా వెనుకబడిపోతున్నారంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సత్య దూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
- మొత్తం నిధుల్లో 94 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి
- అసలే ఎంపీ నిధులు సరిపోక ఇబ్బంది పడుతున్నాం
- ఎంపీ లాడ్స్ నిధులు పెంచాలని ఎప్పటి నుండో కోరుతున్నాం
- అయినా నిధులే వినియోగించడం లేదని దుష్ప్రచారం సరికాదు
- ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ నివేదికను తప్పుపట్టిన కేంద్ర మంత్రి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివరణ
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయిస్తున్న ఎంపీ లాడ్స్ నిధులను వినియోగించుకోవడంలో పార్లమెంట్ సభ్యులు పూర్తిగా వెనుకబడిపోతున్నారంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సత్య దూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఎంపీ లాడ్స్ కింద పంపిన ప్రతిపాదనలకు సంబంధించి పనుల పురోగతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదని పేర్కొన్నారు. ఉదాహరణకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం విషయానికొస్తే... 18వ లోక్‌సభకు సంబంధించి ఎంపీ లాడ్స్ కింద రూ.17.50 కోట్లు కేటాయించగా, అందులో ఇప్పటికే రూ.16.47 కోట్లు వినియోగించామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన వివరాలను గణాంకాలతోసహా మీడియాకు వివరించారు.
వివరాల్లోకి వెళితే....
‘‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గత మూడేళ్లలో కమ్యూనిటీ హాల్స్, బోర్ వెల్స్, హైమాస్ట్ లైట్స్, సీసీ రోడ్ల నిర్మాణాల కోసం స్థానిక ప్రజల నుండి వచ్చిన విజ్ఝప్తుల మేరకు 627 ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపాం. ఇందులో కరీంనగర్ జిల్లా నుండి 313, హన్మకొండ నుండి 39, జగిత్యాల నుండి 45, రాజన్న సిరిసిల్ల నుండి 151, సిద్దిపేట నుండి 79 పనులకు సంబంధించిన ప్రతిపాదనలున్నాయి. వీటిలో 82.29 శాతం పనులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలిపారు. మిగిలిన పనుల మంజూరు అంశం ప్రాసెస్ లో ఉన్నాయి. మొత్తంగా కేంద్రం కేటాయించిన రూ.17.5 కోట్లలో 94.1 శాతం మేరకు అంటే రూ.16.47 కోట్ల నిధులకు సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి’’అని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో 16వ లోక్ సభ సభ్యుడిగా కొనసాగిన బోయినిపల్లి వినోద్ కుమార్ తన ఐదేళ్ల కాలంలో వినియోగించని రూ.2.5 కోట్లను సైతం తాను ఖర్చు చేసినట్లు తెలిపారు.
వాస్తవానికి స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధించి కేంద్రం ఏటా కేటాయిస్తున్న ఎంపీ లాడ్స్ నిధులు సరిపోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా నిధులను ఏటా పెంచాలని కోరుతూ ఇప్పటికే ఎంపీల నుండి కేంద్రానికి అనేక విజ్ఝప్తులొస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ఎంపీ లాడ్స్ నిధులే ఖర్చు చేయడం లేదంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ ప్రచారం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఎంపీ లాడ్స్ నిధుల కేటాయింపు, ఎంపీల ప్రతిపాదనలు, జిల్లా కలెక్టర్ల ఆమోదం, వివిధ శాఖల అధికారుల కార్యాచరణ, అధికారుల అమలు, పనుల పూర్తి వరకు అనేక దశలు ఉన్నాయని తెలిపారు. ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా పార్లమెంట్ సభ్యులు ఎంపీ లాడ్స్ నిధులనే వినియోగించుకోవడం లేదని ఆరోపణ చేయడమంటే బట్ట కాల్చి మీద వేయడమేనని పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపుకు మరో 7 నెలల సమయం ఉన్నప్పటికీ తన వద్ద ఎంపీ లాడ్స్ నిధులే మిగల లేదని, ఆ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఎప్పుడో సంబంధిత జిల్లాల కలెక్టర్లకు పంపామని వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చే ప్రజల విజ్ఝప్తులను పరిష్కరించేందుకు అవసరమైన నిధుల కోసం సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్ ను సేకరిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైనా సంస్థ ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించి ఎంపీ లాడ్స్ నిధుల కేటాయింపు, ఎంపీల ప్రతిపాదనలు, జిల్లా కలెక్టర్ల ఆమోదం, వివిధ శాఖల అధికారుల కార్యాచరణ, అధికారుల అమలు, పనుల పూర్తి వరకు దశల వారీగా వాస్తవాలను పరిగణలోకి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.
సంబంధిత వార్తలు

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
సెప్టెంబర్ 1, 2026

Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
సెప్టెంబర్ 1, 2026

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Nani | లిటిల్ ప్యారడైజ్ - కొడుకుతో నాని ఛాలెంజ్
- ●Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి
- ●YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
- ●Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
- ●Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే
- ●Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు

Nani | లిటిల్ ప్యారడైజ్ - కొడుకుతో నాని ఛాలెంజ్

Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!

Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!



