Bhadradri Kothagudem | శవయాత్రలో పేలిన టపాసులు.. నలుగురికి తీవ్ర గాయాలు
Bhadradri Kothagudem | శవయాత్రలో విషాదం నెలకొంది. డీజే ట్రాలీలో టపాసులు పేలడంతో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
Bhadradri Kothagudem | త్రినేత్ర న్యూస్ : శవయాత్రలో విషాదం నెలకొంది. డీజే ట్రాలీలో టపాసులు పేలడంతో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్య తండాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
వెంకట్య తండాకు చెందిన ఓ మహిళ చనిపోయింది. దీంతో బుధవారం ఉదయం అంతిమయాత్ర చేపట్టారు. అయితే డీజే ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు డీజే ట్రాలీలో ఉన్న టపాసులు పేలిపోయాయి. మంటలు చెలరేగడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భూక్య రానా, అంగోత్ ధ్రువన్కు తీవ్ర గాయాలు కాగా, డ్రైవర్ నవీన్, మరో వ్యక్తి రవికుమార్ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రానా, ధ్రువన్ 70 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
విషయం తెలుసుకున్న టేకులపల్లి ఎస్ఐ కోగిల తిరుపతి టేకులపల్లి రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..
- ●Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?
- ●Navaratri Brahmotsavam | సింహ వాహనంపై యోగ నరసింహునిగా మలయప్పస్వామి
- ●Soma Bharat Kumar | హరీశ్రావుకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు
- ●Ponguleti Srinivas Reddy | అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు
- ●Dell XPS 13 | 2.5కె డిస్ప్లే, డాల్బీ అట్మోస్తో డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్టాప్లు.. ధర ఎంతంటే..

Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..

Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?

Navaratri Brahmotsavam | సింహ వాహనంపై యోగ నరసింహునిగా మలయప్పస్వామి

Soma Bharat Kumar | హరీశ్రావుకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు



