త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murdered | త‌ల్లి ప్రేమ‌ను మ‌రిచి.. క‌న్న కొడుకుని క‌డ‌తేర్చి..

కన్న కొడుకులకు పెళ్లి కావడం లేదని తండ్రి ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి కుదిరితే శుభ‌లేఖలు రాయాల్సిన చేత మ‌ర‌ణ శాస‌నం రాశాడు. తల్లిని, కన్నకొడుకును క‌డ‌తేర్చి ఆపై తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిని విషాదాంతమిది.

S

Telangana | Published On Feb 1, 2026, 4.24 pm IST

Murdered | త‌ల్లి ప్రేమ‌ను మ‌రిచి.. క‌న్న కొడుకుని క‌డ‌తేర్చి..
Advertisement

- కుమారుల‌కు పెళ్లి కావ‌డం లేద‌ని ఓ తండ్రి ఘాతుకం
- త‌ల్లిని, రెండో కొడుకు త‌ల‌ల‌పై బాది హ‌త్య
- ఆపై తానూ ఆత్మ‌హ‌త్య

త్రినేత్ర‌.న్యూస్‌ : కన్న కొడుకులకు పెళ్లి కావడం లేదని తండ్రి ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి కుదిరితే శుభ‌లేఖలు రాయాల్సిన చేత మ‌ర‌ణ శాస‌నం రాశాడు. తల్లిని, కన్నకొడుకును క‌డ‌తేర్చి ఆపై తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిని విషాదాంతమిది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూర్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు, బాధిత కుటుంబ స‌భ్యుల‌ ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన జ‌క్క‌ని స‌త్త‌య్య (65), దేవ‌వ్వ దంప‌తులకు న‌రేశ్‌, సురేశ్, రాజేశ్ సంతానం. వీరు హోట‌ల్ న‌డిపిస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. న‌రేశ్‌కు 12 ఏండ్ల క్రితం వివాహం కాగా భార్య‌, ఇద్ద‌రు బిడ్డ‌ల‌తో క‌లిసి క‌రీంన‌గ‌ర్‌లో నివాస‌ముంటున్నాడు. రెండో కొడుకు సురేశ్ అక్క‌డే ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో ల్యాబ్ టెక్నీషియ‌న్‌గా, మూడో కుమారుడు రాజేశ్ సిరిసిల్ల‌లో ఆటో మెకానిక్‌గా ప‌ని చేస్తున్నాడు.

ఈ క్ర‌మంలో పెళ్లీడుకొచ్చిన కుమారుల‌కు తండ్రి సత్తయ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇందుకోసం హోట‌ల్‌ను కూడా మూసేసిన స‌త్త‌య్య కుటుంబంతో క‌లిసి సిరిసిల్ల‌లోనే ఉంటున్నాడు. సురేశ్‌కు పెళ్లి సంబంధాలు చూసినా ఖాయం కాక‌పోవ‌డంతో రాజేశ్‌కు చూడ‌టం మొద‌లుపెట్టారు. ఏడాది గ‌డిచినా ఫ‌లితం లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో కుటుంబ స‌భ్యుల‌కు త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవి. కాగా శ‌నివారం దేవ‌వ్వ‌కు పంటినొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లింది. సాయంత్రం రాజేశ్‌తో క‌లిసి తిరిగి వ‌చ్చేస‌రికి ఇంట్లో ఉన్న భ‌ర్త స‌త్త‌య్య‌, ఆయ‌న త‌ల్లి య‌శోద (96), సురేశ్ (35) విగ‌త‌జీవులుగా క‌నిపించారు. య‌శోద‌, సురేశ్ త‌ల‌ల‌కు బ‌ల‌మైన గాయాలై తీవ్ర ర‌క్త‌స్రావమైన‌ట్లు గుర్తించారు. స‌త్త‌య్య మ‌రో గ‌దిలో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డగా అత‌డి వ‌ద్ద ల‌భించిన ఓ లేఖ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు క‌మిష‌న‌ర్ ర‌ష్మీ పెరుమ‌ళ్‌, ఏసీపీ ర‌వీంద‌ర్ రెడ్డి, సీఐ శ్రీను, ఎస్సై సౌజ‌న్య ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement