Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
Fake SIR staff | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఇంటింటి సర్వేను ఆసరాగా తీసుకున్న దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ (Bibinagar) మండలంలో ఎస్ఐఆర్ సిబ్బందిగా (Fake SIR staff) చెబుతూ వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు ఓ మహిళ మెడలోనుంచి బంగారు మంగళసూత్రాన్ని (gold mangalsutra) ఎత్తుకెళ్లిపోయారు.
Fake SIR staff | త్రినేత్ర.న్యూస్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఇంటింటి సర్వేను ఆసరాగా తీసుకున్న దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ (Bibinagar) మండలంలో ఎస్ఐఆర్ సిబ్బందిగా (Fake SIR staff) చెబుతూ వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు ఓ మహిళ మెడలోనుంచి బంగారు మంగళసూత్రాన్ని (gold mangalsutra) ఎత్తుకెళ్లిపోయారు. మండలానికి చెందిన కే.అండాలు అనే మహిళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చారు. తాము సర్ సర్వే కోసం వచ్చామని, ఆమె ఫోటోలు తీసుకోవాలని నమ్మించారు. అయితే ఫోటో తీసేటప్పుడు మెడలోని మంగళసూత్రం కనిపించకూడదని, కాబట్టి దాన్ని తీసేయాలని ఆమెకు చెప్పారు. నిజమేనని నమ్మిన ఆమె.. తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి, ఇంటి బయటే నిలబడి ఉన్న తన భర్తకు ఇచ్చింది. దీంతో నిందితులు ఆమెను కొన్ని ఫోటోలు తీసుకున్నారు. తర్వాత సమీపంలోని గుడికి రావాలని ఆమెను కోరారు.
బాధితురాలు వారితో కలిసి ఒక 200 మీటర్లు వెల్లినతర్వాత.. ఇద్దరు వ్యక్తులు తిరిగి ఆమె ఇంటికి వెళ్లి.. అక్కడ నిలబడి ఉన్న ఆమె భర్త చేతిలోని మంగళసూత్రాన్ని (gold chain ) లాక్కుని బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనపై బాధితులు బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Raids on Drugs | యాదాద్రి జిల్లాలో భారీ ఆపరేషన్.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఆగస్టు 9, 2026

Medical Student | ఐదో అంతస్తు నుంచి దూకి.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..
జులై 25, 2026

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
జులై 24, 2026
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత



