త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dammapeta | రోడ్డు ప‌క్క‌న రూ.500 నోట్లు.. భ‌ద్రాద్రి జిల్లాలో క‌ల‌క‌లం..!

Dammapeta | కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామ శివారులో రూ30వేల విలువైన నకిలీ రూ.500 నోట్లు బయటపడటం కలకలం రేపింది. స్థానిక చెరువు క‌ట్ట వ‌ద్ద న‌కిలీ నోట్లు క‌నిపించ‌గా పోలీసులు స్వాధీనం చేసుకొని విచార‌ణ చేప‌ట్టారు.

P

Telangana | Published On Apr 29, 2026, 11.41 am IST

Dammapeta | రోడ్డు ప‌క్క‌న రూ.500 నోట్లు.. భ‌ద్రాద్రి జిల్లాలో క‌ల‌క‌లం..!
Advertisement

Dammapeta | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో న‌కిలీ నోట్లు క‌ల‌క‌లం సృష్టించాయి. దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామం సమీపంలో ఉన్న కొర్రాజుల చెరువు వద్ద బుధవారం ఉదయం గ్రామస్తులు రోడ్డుకట్ట పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న రూ.500 నోట్లు క‌నిపించాయి. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయడంతో దమ్మపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎస్ఐ సాయి కిశోర్‌రెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్ఐ బాలస్వామి బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

గ్రామస్తుల సహకారంతో అక్కడ పడి ఉన్న నోట్లను సేకరించి స్వాధీనం చేసుకున్నారు. నోట్ల‌ను ప‌రిశీలించ‌గా న‌కిలీవ‌ని తేలింది. సుమారు రూ.30వేల విలువ చేసే ఈ ఫేక్ కరెన్సీని ఎవరు, ఏ ఉద్దేశంతో అక్కడ పడేసారనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు లేదా ముఠాను గుర్తించేందుకు సమాచారం సేకరిస్తున్నారు. గ్రామ శివారులో నకిలీ నోట్లు కనిపించడం స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది.

Advertisement
Advertisement