Jeevan Reddy | వెల్‌డన్ జీవన్ రెడ్డి.. వెన్ను తట్టిన రాజీవ్ గాంధీ
Jeevan Reddy | అది 1991, మే 20.. జగిత్యాలలోని ఎస్‌కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్.. జనాలతో కళాశాల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.. ఇసుకెస్తే రాలనంతా జనం.. సాయంత్రం నాలుగైదు గంటలకు మాజీ ప్రధాని, నాటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ.. సభా వేదికపైకి రానే వచ్చారు. ఇక జనసందోహాన్ని చూసి రాజీవ్ నోట మాట రాలేదు.. ఆ సభకు అధ్యక్షత వహిస్తున్న టీ జీవన్ రెడ్డిని భుజం తట్టి.. వెల్‌డన్ జీవన్ రెడ్డి అని ప్రశంసించారు.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : అది 1991, మే 20.. జగిత్యాలలోని ఎస్‌కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్.. జనాలతో కళాశాల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.. ఇసుకెస్తే రాలనంతా జనం.. సాయంత్రం నాలుగైదు గంటలకు మాజీ ప్రధాని, నాటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ.. సభా వేదికపైకి రానే వచ్చారు. ఇక జనసందోహాన్ని చూసి రాజీవ్ నోట మాట రాలేదు.. ఆ సభకు అధ్యక్షత వహిస్తున్న టీ జీవన్ రెడ్డిని భుజం తట్టి.. వెల్‌డన్ జీవన్ రెడ్డి అని ప్రశంసించారు. ఎందుకంటే.. అప్పటి వరకు రాజీవ్ గాంధీ సభలకు అంత పెద్ద ఎత్తున జనాలు రాలేదు.. ఏ నాయకుడు కూడా ఆ స్థాయిలో జనాన్ని సమీకరించలేదు. సభా ప్రాంగణం జనాలతో నిండిపోవడంతో.. సమీపంలో, రహదారులపై చీమలదండులా బారులు తీరిన జనాన్ని చూసి.. రాజీవ్ గాంధీ అబ్బురపడిపోయి జీవన్ రెడ్డిని ప్రశంసించారు. నాటి ప్రశంస జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో గుర్తుండిపోయే చిరకాల తీపి జ్ఞాపకం.
మరో మరుపురాని జ్ఞాపకానికి..
నాడు జీవన్ రెడ్డిని రాజీవ్ గాంధీ వెన్నుతట్టి ప్రశంసించిన వేదికనే మరో మరుపురాని జ్ఞాపకానికి వేదిక కానుంది. నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి.. అదే నాలుగు దశాబ్దాలుగా స్నేహపూర్వకంగా ఉన్న గులాబీ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. అయితే నాటి ఎస్‌కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం ప్రస్తుతం వివేకానంద స్టేడియంగా మారింది. ఇప్పుడు ఈ స్టేడియంలోనే జగిత్యాల జైత్రయాత్ర.. కాంగ్రెస్‌పై దండయాత్రకు బీఆర్ఎస్ పార్టీ సమర శంఖారావం పూరించనుంది. నాటి జనసమీకరణను మించిపోయేలా.. రేపటి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు లక్షలాది మంది జనం పోటెత్తే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



