త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinod Kumar | గ‌డ్డి మందుకు విరుగుడు లేదు.. నిషేధించాల్సిందే : మాజీ ఎంపీ వినోద్ కుమార్

Vinod Kumar | క్ష‌ణికావేశంలో చాలా మంది గ‌డ్డి మందు సేవించి ప్రాణాలు కోల్పోతున్నార‌ని, ఈ నేప‌థ్యంలో దీన్ని నిషేధించాల‌ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే ప‌లు దేశాలు గ‌డ్డి మందును నిషేధించాయ‌ని మాజీ ఎంపీ గుర్తు చేశారు.

S

Telangana | Published On Feb 21, 2026, 5.24 pm IST

Vinod Kumar | గ‌డ్డి మందుకు విరుగుడు లేదు.. నిషేధించాల్సిందే : మాజీ ఎంపీ వినోద్ కుమార్
Advertisement

Vinod Kumar | త్రినేత్ర.న్యూస్ : క్ష‌ణికావేశంలో చాలా మంది గ‌డ్డి మందు సేవించి ప్రాణాలు కోల్పోతున్నార‌ని, ఈ నేప‌థ్యంలో దీన్ని నిషేధించాల‌ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే ప‌లు దేశాలు గ‌డ్డి మందును నిషేధించాయ‌ని మాజీ ఎంపీ గుర్తు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో డాక్ట‌ర్ మ‌ర్రి మ‌హేశ్ రెడ్డితో క‌లిసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

పెస్టిసైడ్ కంపెనీలు పోటీ పడి గడ్డి మందును తయారు చేశాయి. పారా క్విట్ డై క్లోరైడ్ అనే విష పూరిత మందుకు విరుగుడు మందు లేదు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి ప్రతి నెల గడ్డి మందు తాగి 10 నుంచి 20 మరణిస్తున్నారని నివేదిక‌లు చెబుతున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఇదే పరిస్థితి ఉంది. గడ్డి మందు సేవించిన‌ మనిషి బ‌తికే ప‌రిస్థితి లేద‌ని డాక్టర్లు చెప్తున్నారు. గడ్డి మందు వాడకుండా నిషేధం విధించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి. గడ్డి మందు వాడకాన్ని ఒడిశా ప్రభుత్వం నిషేధిస్తూ వ‌స్తోంది. ప్రపంచంలో 70 దేశాలు గడ్డి మందును నిషేధించాయి. గడ్డి మందు నిషేధంపై సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖా మంత్రికి లేఖ రాశాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కిషన్‌కు లేఖ రాశాను అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.

Advertisement
Advertisement