త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Santosh Kumar | ఒక మొక్క‌ నాటుదాం.. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షిద్దాం.. సంతోష్ కుమార్ పిలుపు

Santosh Kumar | ధ‌రిత్రి దినోత్స‌వం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు సందేశం ఇచ్చారు. ఈ ధ‌రిత్రి దినోత్స‌వం రోజున ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతుగా ఒక మొక్క‌ను నాటి ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షిద్దామ‌ని పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Apr 22, 2026, 5.26 pm IST

Santosh Kumar | ఒక మొక్క‌ నాటుదాం.. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షిద్దాం.. సంతోష్ కుమార్ పిలుపు
Advertisement

Santosh Kumar | త్రినేత్ర‌.న్యూస్ : ధ‌రిత్రి దినోత్స‌వం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు సందేశం ఇచ్చారు. ఈ ధ‌రిత్రి దినోత్స‌వం రోజున ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతుగా ఒక మొక్క‌ను నాటి ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షిద్దామ‌ని పిలుపునిచ్చారు.

మ‌నం కోరుకునే భ‌విష్య‌త్‌.. ఇవాళ మ‌నం తీసుకునే నిర్ణ‌యాల‌తోనే మొద‌లవుతుంద‌ని.. ఈ భూమి దినోత్స‌వం నాడు గుర్తుంచుకుందాం. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షిస్తామ‌ని ఇచ్చే వాగ్దానంలో భాగంగా.. ప్ర‌తి ఒక్క‌రూ ఒక మొక్క నాటి దానిని పోషించడం కేసీఆర్ దార్శ‌నిక‌త నుంచి ప్రేర‌ణగా తీసుకోవాలి.

ప్ర‌కృతి మ‌న‌కు అన్ని ఇచ్చింది. ప్ర‌కృతికి కూడా మ‌నం తిరిగి ఏదైనా ఇవ్వాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఒక చెట్టు నాటండి.. వ్య‌ర్థాల‌ను త‌గ్గించండి.. నీటిని సంర‌క్షించండి.. ఈ చిరు ప్ర‌య‌త్నం.. పెద్ద ప్ర‌భావాన్ని చూపిస్తుంది.. మీ వంతు మీ బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి.. ప‌చ్చ‌ద‌నం పెంచండి.. ఆరోగ్య‌క‌ర‌మైన రేప‌టిని క‌లిసి నిర్మిద్దాం అని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement