త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NRI BRS UK | ఎన్నారైల పాత్ర మ‌రువ‌లేనిది..

NRI BRS UK | లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

S

Telangana | Published On Apr 19, 2026, 5.39 pm IST

NRI BRS UK | ఎన్నారైల పాత్ర మ‌రువ‌లేనిది..
Advertisement

NRI BRS UK | త్రినేత్ర‌.న్యూస్ : లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తూ పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర గొప్పదని సంతోష్ కుమార్ ఎన్నారైలను అభినందించారు.

గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, అదే సమయంలో వారికి స్ఫూర్తినిచ్చిన కేసీఆర్‌, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని భాగస్వాములైన అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. తాను బతికి ఉన్నంత వరకు తన వంతుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రతీ ఒక్కరు రాబోయే తరాలకు మనం మన భూమిని పర్యావరణాన్ని సురక్షితంగా ఆరోగ్యవంతంగా ఉంచేలా పని చేసి బాధ్యతతో ఉండాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకేపై కేసీఆర్‌కు, పార్టీ నాయకత్వానికి ప్రత్యేక అభిమానమని ఉద్యమం నుండి పార్టీకి అండగా నిలిచారని, తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ ర‌క్ష‌ అని రానున్న రోజుల్లో మనమంతా మళ్ళీ కష్టపడి పని చేసి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం చేయాల‌ని తెలిపారు.

అన్ని సందర్భాల్లో మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్న ఎన్నారైలకు సంతోష్ కృతజ్ఞ‌త‌లు తెలిపారు.

ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీ నాయకులకు సమన్వయం చేస్తూ దాదాపు 26 ఏండ్లుగా వారి వెంటే ఉంటూ వారిని ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా చూసుకోవేడమే కాకుండా, ప్రత్యేకంగా ఎన్నారై బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న సంతోష్ కుమార్‌కు ఎన్నారైల పక్షాన కృతఙ్ఞతలు తెలిపారు. మేమంతా ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటామని, ఎప్పటిలాగే అటు సోషల్ మీడియాలో, ప్రత్యక్ష నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుతాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.

గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు పొందినందుకు మాకందరికీ గర్వంగా ఉందని వారికి శుభాకాంక్షలు తెలిపి, రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు ప్రశంశలు పొందాలని ఆకాక్షించారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే 16 ఏండ్లుగా చేస్తున్న కార్యక్రమాలను సభకు వివరించారు. కేసీఆర్ సంక్షేమ పాలన నుండి ప్రస్తుతం కాంగ్రెస్ రాక్షస పాలనలో పడ్డామని కాబట్టి మళ్ళీ మరో ఉద్యమం చేసి తెలంగాణ ప్రజలను కాపాడుకొని కేసీఆర్ రామరాజ్యం తెచ్చుకోవాలని, దాని కోసం మనంత కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. సంతోష్ ఆద‌రాభిమానం, సమన్వయం ఇలాగే ఉండాలని రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని, సమయమిచ్చి హాజరైనందున కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవ, ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ మాజీ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి, ఇగ్నీట్ మైండ్స్ సంస్థ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ, టాక్ సీనియర్ నాయకులు హరి గౌడ్, రవి రేతినేని, రవి పులుసు, సత్య చిలుముల, రమేష్ ఎసెంపెల్లి, గణేష్ కుప్పాల, అబూజర్, సురేష్ బుడగం, శ్రీకాంత్ జెల్లా, మట్టా రెడ్డి,సత్యపాల్ రెడ్డి, సురేష్ గోపతి, ప్రశాంత్ మామిడాల, క్రాంతి, స్వాతి, జాహ్నవి, దివ్య, తరుణ్, అమరేశ్వరి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement