Kavitha | త్వరలోనే బీఆర్ఎస్ బ్యాన్.. కవిత సంచలన వ్యాఖ్యలు
Kavitha | ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌ను బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ చానెల్‌ను బ్యాన్ చేయటమేంటో కానీ త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేస్తారు అని ఆమె అన్నారు.
దళిత ఐఏఎస్‌పై కథనాలు వస్తే ఖండించరా..?
జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తారా?
ఇదేనా మీ వైఖరి కేటీఆర్..
సృజన్ రెడ్డిని సాకుగా చూపి
మేఘా కృష్ణారెడ్డిని కాపాడుతున్నారు..
నైనీ టెండర్లను రద్దు చేసినట్టే.. ఎండీవోను రద్దు చేయాలి..
రాష్ట్రం కోరకుండా సీబీఐ వస్తుందా..?
మీరే మా పార్టీలోకి రండి.. టీ పీసీసీ చీఫ్‌కు ఆహ్వానం
కేసీఆర్‌కు గుంట నక్క ద్రోహం..
ఫోన్ ట్యాపింగ్ జోక్..
మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Kavitha | త్రినేత్ర.న్యూస్ : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌ను బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ చానెల్‌ను బ్యాన్ చేయటమేంటో కానీ త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేస్తారు అని ఆమె అన్నారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో జరుగుతున్న పరిణామాలపై బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు.
మన రాష్ట్రంలో ఇప్పుడు దారుణమైన ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. మోస్ట్ అన్ పాపులర్ యూట్యూబ్ చానెల్‌లో కథనాలు వేసినట్లు శాటిలైట్ చానెల్‌లో కథనాలు వేస్తున్నారు. దళిత ఐఏఎస్ మీద అలాంటి కథనాలు వేయటంపై మేము ఎంతో బాధపడ్డాం. గతంలో లైన్ అతిక్రమించిన యూట్యూబ్ చానెల్ వాళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి లైన్ అతిక్రమించిన శాటిలైట్ చానెల్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసింది. ఐతే జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరును మేము ఖండిస్తున్నాం. వాళ్లేమీ టెర్రరిస్టులు కాదు. వాళ్లకు నోటీసులు ఇచ్చి వివరణ అడగాల్సింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు సపోర్ట్‌గా నిలిచింది. కానీ కేటీఆర్ మీద ఇలాంటే కథనాలే వస్తే ఆయన అనుచరులు ఒక చానెల్‌పై దాడి చేశారు. అక్కడ మహిళపై కథనాలు వేస్తే దాడి.. ఇక్కడ మహిళలపై కథనాలు వస్తే జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తారా? మహిళల విషయంలో ఇదేనా మీ వైఖరి అని నేను కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత బిడ్డపై కథనాలు వస్తే ఆమెకు అండగా ఉండకపోవటాన్ని ప్రజలు గుర్తించాలి అని కవిత సూచించారు.
తిమింగళం కోసం బీఆర్ఎస్ నేతలు ముందుకు..
ఆ చానెల్‌లో కథనం తర్వాత ఆ కథనం బ్యాక్ గ్రౌండ్ అంటూ ఇంకొక పేపర్‌లో కథనం వచ్చింది. ఆ కథనం ఆధారంగా భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టారు. భట్టి ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క కూడా ప్రెస్ మీట్ పెట్టారు. గుంటనక్క ప్రెస్ మీట్‌ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తానికి నైనీ టెండర్లు రద్దు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే ఇక్కడ విచిత్రాలు జరగుతున్నాయి. రెండేళ్లుగా మేము కార్మికుల సమస్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడిన భట్టి మాట్లాడలేదు. కార్మికులకు వంద అన్యాయాలు జరిగిన సరే బీఆర్ఎస్ కూడా మాట్లాడలేదు. కానీ ఒక తిమింగళం లాంటి కాంట్రాక్టర్‌కు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ నేతలు ముందుకు వస్తున్నారు అని కవిత పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలవి అబద్ధాలు..
2015లో మనకు నైనీ ముందుగా అలాట్ అయ్యింది. 2021లో అదానీ 44 శాతం ఎక్సెస్‌గా టెండర్ వేస్తే ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు. మధ్యలో సిగంరేణి వేరే కంపెనీ వాళ్లకు మట్టి తీసే టెండర్ ఇచ్చింది. దానికి డిజీల్ ఖర్చులతో సహా ఇచ్చారు. కానీ గుంటనక్క అబద్దం చెప్పారు. కేటీఆర్ ఏ విషయమైనా అధ్యయనం చేసి మాట్లాడుతారని అనుకునేదాన్ని. కానీ ఆయన మాట్లాడుతుంటే దారుణం అనిపించింది. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని అన్నారు. కానీ చాలా టెండర్లను ఎక్సెస్‌కు ఇచ్చారు. 36, 16, 7, 8 శాతం ఎక్సెస్‌కు ఇచ్చారు. కాంగ్రెసోళ్లు ఏం సుద్దపూసలు కాదు.. వారు మొత్తానికే ఎక్స్‌స్ ఇచ్చారు. సైట్ విజిట్ అనే నిబంధన సింగరేణిలో గతంలో కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్, కోల్ వాషర్ యూనిట్స్‌కు, కన్వెయర్ బెల్ట్ లాంటి వాటికి ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓబీకి కూడా సైట్ విజిట్ పెట్టారు. దీన్ని ఎక్స్‌పోజ్ చేయటం మంచిదే. కానీ బీఆర్ఎస్ హయాంలో అసలు ఎక్సెస్‌గా టెండర్లు పోలేదని అబద్దాలు చెప్పటం సరికాదు అని కవిత మండిపడ్డారు.
సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్‌లు ఇచ్చిందే గుంట నక్క
గుంటనక్క, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కేటీఆర్ కలిసి చిన్న చేపను పెద్దగా చూపి పెద్ద చేపను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సృజన్ రెడ్డి అనే వ్యక్తికి వచ్చింది కేవలం రూ. 250 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమే. అతను సీఎం బావమరిది అని ఆయనను పెద్దగా చేసి చూపెట్టి.. రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ చేపట్టే మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడటం లేదు. అసలు సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్‌లు ఇచ్చిందే గుంటనక్క. అప్పుడు సీఎం బావమరిది అని వీళ్లకు తెలియదా? సైట్ విజట్ నిబంధన కారణంగా కొంతమందికి అవకాశాలు దెబ్బతింటాయి. కానీ గుంటనక్క చెప్పని విషయమేమిటంటే సాయిల్ ఎక్స్‌వేషన్ పేరుతో మేఘా కృష్ణారెడ్డి సంస్థ అనుభవం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను పెద్ద చేపకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కవిత ధ్వజమెత్తారు.
ఎండీవో విధానాన్ని రద్దు చేయాలి..
హరీష్ రావు మొత్తం దళిత కమ్యూనిటీనే అవమానపరిచే విధంగా భట్టి విక్రమార్కకు లేఖ రాయను అంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే ఆయన లెటర్ రాస్తారంటా? అసలు సింగరేణిలో ఎండీవో అనే సిస్టమ్ పెట్టారు. అది ఉండకూడదు. గతంలో సింగరేణికి ఓపెన్ కాస్ట్‌లతో ఎంతో లాభం ఉండేది. కానీ ఎండీవో సిస్టమ్ తెచ్చి సంస్థకు నష్టం చేస్తున్నారు. దీంతో అసలే నష్టాల్లో ఉన్న సింగరేణి మరింత నష్టపోతోంది. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి రూ. 25 వేల కోట్ల అప్పు పెట్టారు. కాంగ్రెస్ వచ్చాక రూ. 50 వేల కోట్లు అయ్యింది. పవర్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదు. దీంతో సింగరేణి సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. నైనీ టెండర్లు రద్దు చేసినట్లే.. ఎండీవో విధానాన్ని రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అని కవిత పేర్కొన్నారు.
కాంగ్రెస్ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు..
మనం కూడా నైనీ బ్లాక్ ఉన్న ఒరిస్సాకు వెళ్లి ఓపెన్ కాస్ట్ చేయాలి. దాని ద్వారా తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు వస్తాయి. సంస్థకు మేలు జరుగుతుంది. ఎంతో క్వాలిటీ ఉన్న తాడిచర్ల బ్లాక్‌ను కూడా ఎండీవో విధానం ద్వారా ఇచ్చారు. దీంతో సంస్థకు లీజు మాత్రమే వస్తుంది. గ్రేడ్ 9 క్వాలిటీ ఉన్న కోల్‌ను 25 ఏళ్లకు పెద్ద తిమింగళం కోసం కాంట్రాక్ట్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అవినీతిని గమనిస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేసుకోండి. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న డొల్ల విధానాన్ని మేము గమనిస్తున్నాం. బీఆర్ఎస్ అబద్దాలు చెప్పకుండా ప్రజలకు అన్ని వాస్తవాలే చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని కవిత పేర్కొన్నారు.
కొత్త బ్లాక్‌లను సింగరేణికే ఇవ్వాలి..
అసలు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా సీబీఐ వస్తుందా? కానీ గుంటనక్క మాత్రం భట్టికి లేఖ రాయకుండా కిషన్ రెడ్డికి లేఖ రాస్తారంట. గుంటనక్క అడగగానే కిషన్ రెడ్డి ఏదో కమిటీ పేరుతో కమిటీ వేశారు. అందులో ఏజీఎం ర్యాంక్ ఉన్న మారుపల్లి వెంకటేష్ అనే అధికారి ఉన్నాడు. ఆయన సింగరేణి ఎండీని ప్రశ్నించి ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలడా? కిషన్ రెడ్డి దీనికి సమాదానం చెప్పాలి. వాస్తవాలు నిగ్గు తేల్చాలనుకుంటే సైట్ విజిట్ నిబంధన క్యాన్సిల్ చేయాలి. ఎండీవో విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు ఏపీలో, తెలంగాణలో ఉన్న కొత్త బ్లాక్‌లను సింగరేణికే ఇవ్వాలి. కిషన్ రెడ్డి ఈ బ్లాక్‌కు సింగరేణికి వచ్చేలా కృషి చేయాలి అని కవిత సూచించారు.
కార్మికుల పక్షాన మా పోరాటం..
గతంలో గుజరాత్ కు బొగ్గు బ్లాక్‌లను తీసుకొని పోయిన ఘటనలు లేవా? కిషన్ రెడ్డి తెలంగాణ కోసం చేయకపోతే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి ఏం లాభం? తర్వలోనే సింగరేణిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కార్మికుల రిక్రూట్ మెంట్లు, బిల్లులు వచ్చేలా చేయాలి. మాకు మైనార్టీ వాటా ఉందంటూ ఏమీ చేయలేమని కిషన్ రెడ్డి చెప్పటం కరెక్ట్ కాదు. జాగృతి తరఫున నైనీ బ్లాక్‌ను విజిట్ చేసేందుకు ప్రత్యేక డెలిగేషన్ వెళ్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా కార్మికుల పక్షాన ఉండాలి. కానీ కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నారు. జాగృతి మాత్రం ఎప్పటికీ కూడా కార్మికుల పక్షానే ఉంటుంది. వారి కోసం పనిచేస్తుంది అని కవిత స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు..
మహేశ్ కుమార్ గౌడ్ చిట్‌చాట్‌లో చెప్పినట్టు విన్నా.. నేను కాంగ్రెస్‌లోకి వస్తా అంంటే ఆయన వద్దన్నారట. కాంగ్రెస్ లూజింగ్ పార్టీ. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. తెలంగాణలో తప్పకుండా మా జాగృతి అధికారంలోకి వస్తుంది. మిమ్మల్నే జాగృతిలోకి ఆహ్వానిస్తున్నా. మీకు నేషనల్ కన్వీనర్ పోస్టు ఇస్తాం. తిరుగులేని రాజకీయశక్తిగా ఎదుగుతాం. మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు.. మీకు కల పడ్డది కావొచ్చు. ఇటువంటి ప్రయత్నాలతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయొద్దు అని కవిత విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్‌కు గుంటనక్క ద్రోహం..
నైనీ బ్లాక్ విషయంలో నేను మాట్లాడితే టీవీ9 లో నా స్టోరీ వేయరు. అయినా సరే సింగరేణికి రూ. 25 వేల కోట్ల నష్టం వస్తుంది కనుక నేను మాట్లాడుతున్నాను. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారు. కానీ అసలు గుంటనక్క వాటాలు తేలకపోవటంతోనే అలా మాట్లాడుతున్నారు. పైగా ఆయన 2014 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే విచారణ చేయమని అడుగుతున్నారు. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్‌లో పడి అదే విధంగా డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కు గుంటనక్క ద్రోహం చేస్తోంది. గుంటనక్కను ఫాలో అయి గుడ్డిగా కేటీఆర్ గుంతలో పడ్డాడు. పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం అనేది గుంటనక్కకు వెన్నతో పెట్టిన విద్య అని కవిత విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ జోక్..
ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిపోయింది. రెండేళ్లుగా సీరియల్‌గా సాగదీస్తున్నారు. నా లాంటి బాధితులకు మేలు చేయటం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి నోటీసులు ఇస్తున్నారా? బాధితులకు నోటీసులు ఇస్తున్నారా? అర్థం కావటం లేదు. మున్సిపల్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ డ్రామా చేస్తోంది. టెర్రరిస్టుల కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్‌ను అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని కవిత పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

KTR | పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



