త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | జై ఆంధ్రా.. కొత్త నినాదం అందుకున్న క‌ల్వ‌కుంట్ల క‌విత‌

Kavitha | తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కొత్త నినాదం అందుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగుపెట్ట‌గానే ఆమె జై ఆంధ్రా అని నిన‌దించారు.

S

Telangana | Published On Mar 5, 2026, 5.51 pm IST

Kavitha | జై ఆంధ్రా.. కొత్త నినాదం అందుకున్న క‌ల్వ‌కుంట్ల క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కొత్త నినాదం అందుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగుపెట్ట‌గానే ఆమె జై ఆంధ్రా అని నిన‌దించారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో జై ఆంధ్రా అని నిన‌దిస్తూ మీడియాతో క‌విత మాట్లాడారు.

తప్పుడు కేసు పెట్టి నన్ను నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు. కానీ సత్యం నా వైపు ఉండటంతో ఆ దేవుడి దయతో కేసును కోర్టు డిశ్చార్జ్ చేసింది. వేంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకం. కాలి నడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉంది. కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా మా కుటుంబం, జాగృతి కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకోవటానికి వచ్చాం. ఆంధ్రాలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారు వారందరికీ కృతజ్ఞతలు. త్వ‌రలోనే మేము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాను అని క‌విత పేర్కొన్నారు.

Advertisement
Advertisement