Kavitha | కవిత కోసం పీకే.. కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు..!
Kavitha | తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకు సమయం ఆసన్నమైంది. సామాజిక తెలంగాణే తమ లక్ష్యమంటూ గళమెత్తుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో ఈ కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది.
Kavitha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకు సమయం ఆసన్నమైంది. సామాజిక తెలంగాణే తమ లక్ష్యమంటూ గళమెత్తుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో ఈ కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. ఈ క్రమంలో కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు కవితతో కలిసి పని చేసేందుకు పీకే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో రెండు నెలల వ్యవధిలో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌కు వచ్చి రెండుసార్లు కవితను కలిసినట్లు సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పీకేతో కవిత కొత్త పార్టీపై సమాలోచనలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు.. ప్రజలు తమ పార్టీగా ఓన్ చేసుకోవడం.. ప్రజల కోణంలో ఎలా పని చేయాలనే అంశంపై పీకేతో కవిత సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నారు కవిత. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో కవిత వేగం పెంచినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సెప్టెంబర్ 2న కవితపై వేటు
గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి టీ రవీందర్ రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్‌కు రాజీనామా
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మరుసటి రోజే కవిత తన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె అదే రోజు రాజీనామా చేశారు.
జనవరి 5న మండలిలో కవిత ప్రసంగం
ఈ ఏడాది జనవరి 5న కల్వకుంట్ల కవిత మొదటిసారి శాసనమండలిలో బోరున ఏడుస్తూ ప్రసంగం కొనసాగించారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే మండలిలో ప్రసంగించారు. తన మనసులోని బాధను, అవమానాలను, ఆవేదనను మండలి సాక్షిగా ఆమె బయపెట్టేశారు. నేను గత ఏడాది సెప్టెంబర్ 3వ తేది నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. ఆరోజు మీరు ఆవేశపడకండి, ఆలోచించుకోండి సమయం ఇస్తున్నానని చెప్పారు. నాలుగు నెలల సమయంలో కూడా మీరు నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు సభకు చెప్పాలని భావించాను. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన బీఆర్ ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భాద్యతలను నిర్వర్తించడానికి ఇప్పుడు అదే పార్టీ నుండి నాకు అనేక కట్టుబాట్లు ఎదురవుతున్నాయి.అందుకే ఆపార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను. పార్టీ ఇచ్చిన పదవిలో కొనసాగడం నైతికత కాదు కాబట్టి , పార్టీ ఇచ్చిన పదవకిి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. మీరు నా రాజీనామా ఆమోదించాలని సభాముఖంగా కోరుతున్నాను అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత విజ్ఞప్తి చేశారు.
జనవరి 7న రాజీనామాకు ఆమోదం
శాసనమండలి సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 7న ఆమోదించిన విషయం విదితమే. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసనమండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రాజీనామా ఆమోదంతో ఆమె ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. ప్రస్తుతం కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం





