త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | కొత్త నెత్తురును ఈ గ‌డ్డ‌కు ప‌రిచయం చేస్తా : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

Kalvakuntla Kavitha | తెలంగాణ భ‌విష్య‌త్‌, చ‌రిత్ర‌ను మార్చే రోజు ఏప్రిల్ 25 అని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. కొత్త నెత్తురు, కొత్త రాజ‌కీయాల‌ను ఈ గ‌డ్డ‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Apr 8, 2026, 3.44 pm IST

Kalvakuntla Kavitha | కొత్త నెత్తురును ఈ గ‌డ్డ‌కు ప‌రిచయం చేస్తా : క‌ల్వ‌కుంట్ల క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ భ‌విష్య‌త్‌, చ‌రిత్ర‌ను మార్చే రోజు ఏప్రిల్ 25 అని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. కొత్త నెత్తురు, కొత్త రాజ‌కీయాల‌ను ఈ గ‌డ్డ‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ క‌విత కండువా క‌ప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తాం. పప్పన్నం తింటాం, ప్రజల మధ్యలో ఉంటాం. వారితోనే కలిసి పనిచేస్తాం. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం తెస్తాం. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేదేవరు అంటే ప్రతినోట జాగృతియే అనే మాట వస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారింది. రియల్ ఎస్టేట్, హైడ్రా పేరుతో బెదిరిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది అని క‌విత ధ్వ‌జ‌మెత్తారు.

రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి నిలబడే మాట్లాడుతున్నాడు. లేదంటే తన కుర్చీకి ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నాడు. ప్రజల సమస్యల గురించి అడిగితే నో రాహుల్ జీ అని ఆయనకు సమాధానం చెబుతున్నాడు. కానీ కేరళ ఎన్నికలు, మనీ కావాలంటే మాత్రం ఎస్ రాహుల్ జీ అంటూ గులాంగిరీ చేస్తున్నారు. అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉన్నాడు. జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాయే అని క‌విత పేర్కొన్నారు.

కానీ బీజేపీని ఒక్క మాట కూడా ఈ ముఖ్యమంత్రి అనటం లేదు. అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని మెయింటెన్ చేస్తూ ప్రజలను మాత్రం మోసం చేస్తున్నాడు. తెలంగాణ జాగృతి తరఫున వచ్చే పార్టీ.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నాం. కొత్త తరహా రాజకీయాలు, ప్రజల కోసం చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తామ‌ని క‌విత అన్నారు.

Advertisement
Advertisement