త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ex MLA Gongidi Sunitha | క‌విత వెనుక ఎవ‌రు ఉన్నారో అర్థ‌మైంది: మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

Ex MLA Gongidi Sunitha | హైద‌రాబాద్‌: ఎమ్మెల్సీ క‌విత కంక‌ణం క‌ట్టుకుని మ‌రీ బీఆర్ఎస్ పార్టీని నాశ‌నం చేయాల‌ని చూస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు. రాష్ట్ర శాస‌న‌మండ‌లి స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం ఆమె మండ‌లిలో మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jan 6, 2026, 8.12 am IST

Ex MLA Gongidi Sunitha | క‌విత వెనుక ఎవ‌రు ఉన్నారో అర్థ‌మైంది: మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
Advertisement

Ex MLA Gongidi Sunitha | హైద‌రాబాద్‌: ఎమ్మెల్సీ క‌విత కంక‌ణం క‌ట్టుకుని మ‌రీ బీఆర్ఎస్ పార్టీని నాశ‌నం చేయాల‌ని చూస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు. రాష్ట్ర శాస‌న‌మండ‌లి స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం ఆమె మండ‌లిలో మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒకానొక సంద‌ర్భంలో భావోద్వేగానికి గురై కంటత‌డి పెట్టారు. అయితే క‌విత వ్యాఖ్య‌ల‌కు గొంగిడి సునీత స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సునీత మాట్లాడుతూ క‌విత మాట‌లు బీఆర్ఎస్ పార్టీకి పెను ముప్పుగా ప‌రిణ‌మించాయ‌ని అన్నారు. ఆమె వెనుక ఎవ‌రో ఉండి న‌డిపిస్తున్నార‌ని, దీంతో ఆమె కీలుబొమ్మ‌గా మారి ఇలా మాట్లాడుతున్నార‌ని అన్నారు. క‌విత మాట‌ల వ‌ల్ల కేసీఆర్ కంట‌త‌డి పెడుతున్నార‌ని, ఆయ‌న మాన‌సిక క్షోభ‌కు గుర‌వుతున్నార‌ని, క‌విత వైఖ‌రిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల ప్ర‌కారం త‌మ ఎమ్మెల్యేలంద‌రూ అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించార‌ని, కానీ క‌విత మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇందులో మ‌త‌ల‌బు ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

స్వేచ్ఛ లేక‌పోతే అన్ని ప‌ద‌వులు ఎలా..?

క‌విత తాను ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు చెబుతున్నార‌ని, కానీ అదంతా నాట‌క‌మ‌ని సునీత అన్నారు. ఆమె మ‌న‌స్ఫూర్తిగా ఈ రాజీనామా చేయ‌డం లేద‌న్నారు. ఆమెకు అస‌లు ప‌ద‌వే వ‌ద్దనుకుంటే అస‌లు మండ‌లి స‌మావేశాల‌కు ఎందుకు హాజ‌ర‌య్యార‌ని అన్నారు. పార్టీలో స్వేచ్ఛ లేద‌ని కవిత అంటున్నార‌ని, స్వేచ్ఛ లేక‌పోతే ఆమెకు అన్ని ప‌ద‌వులు ఎలా వ‌చ్చాయ‌ని, ఆమె చెప్పిన వారు, ఆమె స్నేహితులు అన్ని ప‌ద‌వుల‌ను ఎలా అనుభ‌వించ‌గ‌లిగార‌ని ప్ర‌శ్నించారు. క‌విత ఎంపీగా పోటీ చేసి బాధ‌ప‌డుతుంటే కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీని చేసి మండ‌లిలో కూర్చోబెట్టార‌ని, ఆ విష‌యాన్ని క‌విత ఎలా మ‌రిచిపోయార‌ని అన్నారు. పార్టీలో అస‌లు క‌విత‌కు ఉన్నంత చ‌నువు మ‌రెవ‌రికీ లేద‌ని, కానీ ఇప్పుడు అలాంటి పార్టీని నాశ‌నం చేసేలా ఆమె మాట్లాడుతున్నార‌ని, కూర్చున్న కొమ్మను న‌రుక్కున్న చందంగా క‌విత వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు.

ఆమె వెనుక ఎవ‌రున్నారో అర్థ‌మైంది..

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చ‌డం ఇష్టం లేద‌ని క‌విత చెప్పార‌ని, మ‌రి ఆమె సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతిని భార‌త జాగృతిగా ఎలా మార్చార‌ని సునీత ప్ర‌శ్నించారు. క‌విత ద్వంద్వ వైఖ‌రిని అనుస‌రిస్తున్నార‌ని చెప్పేందుకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీని నాశ‌నం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నార‌ని ఆరోపించారు. మ‌ద్యం కేసులో క‌విత‌ను అరెస్టు చేసిన‌ప్పుడు హ‌రీష్ రావు, కేటీఆర్ వారానికి నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లార‌ని గుర్తు చేశారు. ఆమె కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ని, కానీ క‌విత మాత్రం ప్ర‌స్తుతం పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ పార్టీని నాశ‌నం చేసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌భుత్వం క‌నీసం స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని, మ‌రి క‌విత‌కు అంత స‌మ‌యం ఎలా కేటాయించారో చెప్పాల‌ని, దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఆమె వెనుక ఎవ‌రు ఉన్నారు, ఆమెను ఎవ‌రు న‌డిపిస్తున్నారు అన్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని అన్నారు. క‌విత ఆట‌ల‌ను ఇక‌పై సాగ‌నివ్వ‌మ‌ని సునీత హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement