త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aruri Ramesh | క‌డియం శ్రీహ‌రి పాపాత్ముడు.. నిప్పులు చెరిగిన ఆరూరి ర‌మేశ్‌

Aruri Ramesh | త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు అడ్డుప‌డ్డ క‌డియం శ్రీహ‌రి పాపాత్ముడు అని వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఓట‌మికే కాదు.. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఓట‌మికి కూడా క‌డియం కార‌కుడు అని ర‌మేశ్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Jan 28, 2026, 8.18 pm IST

Aruri Ramesh | క‌డియం శ్రీహ‌రి పాపాత్ముడు.. నిప్పులు చెరిగిన ఆరూరి ర‌మేశ్‌
Advertisement

Aruri Ramesh | త్రినేత్ర‌.న్యూస్ : త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు అడ్డుప‌డ్డ క‌డియం శ్రీహ‌రి పాపాత్ముడు అని వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఓట‌మికే కాదు.. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఓట‌మికి కూడా క‌డియం కార‌కుడు అని ర‌మేశ్ పేర్కొన్నారు. బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఆరూరి ర‌మేశ్ మాట్లాడారు.

గులాబీ సైన్యాన్ని చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ వ‌స్తుంది. పిల్లాడు త‌ప్పిపోతే గాయిగాయి తిరిగి ఇంటికి వ‌స్తే ఎంత సంబురం ఉంటుందో.. ఇవాళ అట్ల ఉంది. ఎందుకంటే కేసీఆర్ న‌న్ను ఒక కుటుంబ స‌భ్యుడిగా చూసుకునే వారు. ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో నిధుల మంజూరు కోసం పోతే సీఎంగా కేసీఆర్ వెంట‌నే మంజూరు చేసేవారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఒక కుటుంబ స‌భ్యుడిగా ఉన్న ఆరూరి ర‌మేశ్ పార్టీ ఎందుకు మారాడు అని మీడియా ప్ర‌తినిధుల‌కు, రాజ‌కీయ నేత‌ల‌కు ఒక ప్ర‌శ్న ఉండే. వ‌రంగ‌ల్ జిల్లాలో అనేక మంది మీద బుర‌ద‌జ‌ల్లి రాజ‌కీయంగా ఎదగ‌కుండా చేసిన మ‌హానుభావుడు క‌డియం శ్రీహ‌రి. ఎన్నిక‌ల ముందు రేవంత్ రెడ్డితో క‌డియం ములాఖ‌త్ అయి.. అనేక మందిని ఓట‌మి పాలు చేశారు. కాంగ్రెస్ కోవ‌ర్టుగా ప‌ని చేసి మోసం చేశాడు శ్రీహ‌రి. త‌న సొంత బిడ్డ కోసం టికెట్ ఆశించి పార్టీకి ద్రోహం చేశాడు. నా మీద లేనిపోని ఆరోప‌ణ‌లు చేసి, రాజ‌కీయంగా ఎద‌గ‌నివ్వ‌కుండా అడ్డుప‌డ్డాడు క‌డియం శ్రీహ‌రి. అలాంటి ప‌రిస్థితుల్లోనే నేను పార్టీ మారాల్సి వ‌చ్చింద‌ని ఆరూరి ర‌మేశ్ స్ప‌ష్టం చేశారు.

ఇక విధిలేని ప‌రిస్థితుల్లోనే బీజేపీ నుంచి పార్ల‌మెంట్‌కు పోటీ చేశాను. బీఆర్ఎస్ పార్టీపై కానీ, కేసీఆర్‌ను కానీ ఒక్క మాట అన‌లేదు. ఎందుకంటే కేసీఆర్ నా గుండెల్లో ఉన్నారు. క‌డియం లాంటి పాప‌త్ములు బ‌య‌ట‌కు పోయారు కాబ‌ట్టి తిరిగి త‌న సొంత ఇంటికి చేరుకున్నాను. జ‌రిగిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాల‌ని వ‌చ్చాను. కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేస్తాను. కాంగ్రెస్ పాల‌న‌లో అన్ని రంగాల్లో ప్ర‌జ‌లు ఆగ‌మాగం అయ్యారు. కేసీఆర్ సంప‌ద పెంచి అంద‌రి ముఖాల్లో సంతోషం చూశారు. ఇవాళ కేసీఆర్‌ను ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నిక‌లు వ‌స్తే కేసీఆర్‌ను సీఎం చేసుకోవాల‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఎలా క‌ష్ట‌ప‌డ్డానో.. రేపు రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లు కావొచ్చు.. ఏ ఎన్నికైనా స‌రే బాధ్య‌త‌తో తీసుకొని గెలిపిస్తాను అని ఆరూరి ర‌మేశ్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement