Srinivas Goud | తెలంగాణ అధికారులపై ఆంధ్ర అధికారుల పెత్తనం
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో సమర్థులెవరూ లేనట్టు.. శ్రీకాకుళం నుంచి ఓ అధికారిని రప్పించుకొని ఆయనకే ఎక్సైజ్ శాఖ కమిషనర్ పోస్టు కట్టబెట్టడం వెనక మతలబు ఏమిటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళంకు చెందిన చేవూరి హరికిరణ్‌కు కీలకమైన ఎక్సైజ్ కమిషనర్ పోస్టు
ఉద్యోగులను వేధిస్తున్న ఆయనను తక్షణం తప్పించాలి
రాష్ట్రంలోకి అనధికారికంగా ఆంధ్రా మద్యం
లంచాలు తీసుకుంటున్న ఎక్సైజ్ మంత్రి ఓఎస్డీ
ఆత్మగౌరవం ప్రదర్శించిన సోమిరెడ్డికి హ్యాట్సాఫ్
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో సమర్థులెవరూ లేనట్టు.. శ్రీకాకుళం నుంచి ఓ అధికారిని రప్పించుకొని ఆయనకే ఎక్సైజ్ శాఖ కమిషనర్ పోస్టు కట్టబెట్టడం వెనక మతలబు ఏమిటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర నుంచి వచ్చిన అధికారులకే ముఖ్యమైన పదవులు అప్పజెప్పి తెలంగాణ వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తున్నదని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ అకారణంగా నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అనరాని బూతులు అన్నందుకు.. సోమిరెడ్డికి గుండెపోటు వచ్చి కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం సోమిరెడ్డిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి వచ్చి.. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, వాల్య నాయక్, రామచంద్ర నాయక్, సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే..
సోమిరెడ్డి సిన్సియర్ అధికారి
రిజ్వి అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్.. ఇప్ప్పటికే ఈ ప్రభుత్వం తీరుతో బలవంతంగా పదవీ విరమణ తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి ఎక్సైజ్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హరికిరణ్ తన సంస్కారాన్ని కోల్పోయి.. సహచర ఉద్యోగి అయిన సిన్సియర్ ఆఫీసర్ సోమిరెడ్డిని ఇడియట్.. వెధవా.. అంటూ తిట్టాడు. దీంతో సోమిరెడ్డికి గుండెపోటు వచ్చి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమిరెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత. ఆంధ్రా నుంచి వచ్చి రావడంతోనే హరికిరణ్‌కు ఎక్సైజ్ శాఖ కమిషనర్ పదవి ఇచ్చారు. ఆయన ఎవరి రికమండేషన్‌తో ఆ పదవిలోకి వచ్చారో లోతుగా తెలుసుకుంటాం. సోమిరెడ్డి అత్యంత నిజాయితీ పరుడైన తెలంగాణ బిడ్డ. ఆయన ఆత్మగౌరవానికి హ్యాట్సాఫ్ చెబుతున్నాం. ఆంధ్రా అధికారి బూతులతో ఇక తాను ఉద్యోగం చేయనని ఆత్మగౌరవం ప్రదర్శించారు. సోమిరెడ్డిలా ఇంకెంతమంది అధికారులు.. ఆంధ్ర అధికారుల దాష్టీకానికి మానసిక వ్యథ చెందాలి.
ఆయన లంచాలకు లెక్కే లేదు
ఎక్సైజ్ శాఖ ఓఎస్డీగా ఓ రిటైర్డ్ అధికారి పని చేస్తున్నారు. ఆయన చేస్తున్న అక్రమాలకు అంతేలేదు. కూకట్‌పల్లిలోని ఓ వైన్ షాపులో అక్రమంగా దొంగ దారిన ఆంధ్ర మద్యం అమ్ముతున్నారు. ఆ మద్యాన్ని ప్టటుకొని కొంత ఫైన్ వేసి లక్షల్లో లంచం తీసుకున్నారు. ఆ లంచం నేరుగా మంత్రి ఓఎస్డీకే వెళ్లింది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యోగుల పట్ల ఆంధ్రా అధికారుల వైఖరి మారక పోతే మరో ఉద్యమం వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం ఏమిటి? ఉద్యోగులను వేధిస్తున్న హరి కిరణ్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించాలి. ఏసీబీ... తిమింగలాలను వదిలేసి చిరు ఉద్యోగుల మీద పడుతోంది. ఎక్సైజ్ కానిస్టేబుళ్లను ఇష్టమొచ్చినట్టు బదిలీలు చేస్తున్నారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



