త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | సహకార సంఘాల నిర్వీర్యానికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర : నిరంజ‌న్ రెడ్డి

Niranjan Reddy | రాష్ట్రంలో స‌హ‌కార సంఘాల నిర్వీర్యానికి కాంగ్రెస్ స‌ర్కార్ కుట్ర చేస్తుంద‌ని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Dec 21, 2025, 12.06 pm IST

Niranjan Reddy | సహకార సంఘాల నిర్వీర్యానికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర : నిరంజ‌న్ రెడ్డి
Advertisement

Niranjan Reddy | హైద‌రాబాద్ : రాష్ట్రంలో స‌హ‌కార సంఘాల నిర్వీర్యానికి కాంగ్రెస్ స‌ర్కార్ కుట్ర చేస్తుంద‌ని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు. పాలకమండళ్లకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు.

గడువు ముగిసి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణం అని మండిప‌డ్డారు. ఎన్నికలకు వెళితే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని నామినేటెడ్ పద్దతిలో పాలకమండళ్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నామినేటెడ్ పద్దతిలో సహకార సంఘాల పాలకవర్గాల నియామకం చేయాలన్న యోచన పూర్తి అప్రజాస్వామికమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. అలాంటి ఆలోచన ఉంటే ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌ని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో దిమ్మదిరిగిన ప్రభుత్వం .. ఎన్నికలకు వెళ్తే గుణపాఠం తప్పదని నామినేటెడ్ యోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. సహకార సంఘాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలి అని నిరంజ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement