త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lava Aura Curve 5G | లావా ఆరా కర్వ్ 5జి వచ్చేసింది.. ధర రూ.23,999..

Lava Aura Curve 5G | దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ లావా తన స్మార్ట్‌ఫోన్‌ విభాగాన్ని విస్తరిస్తూ ఆరా సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆఫ్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లావా ఆరా కర్వ్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇదే ఫోన్‌ను గత నెలలో ఆన్‌లైన్‌ మార్కెట్‌ కోసం విరాట్‌ కర్వ్‌ పేరుతో కంపెనీ పరిచయం చేసింది.

S

Technology | Published On Oct 21, 2026, 3.00 pm IST

Lava Aura Curve 5G | లావా ఆరా కర్వ్ 5జి వచ్చేసింది.. ధర రూ.23,999..
Advertisement

Lava Aura Curve 5G | దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ లావా తన స్మార్ట్‌ఫోన్‌ విభాగాన్ని విస్తరిస్తూ ఆరా సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆఫ్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లావా ఆరా కర్వ్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇదే ఫోన్‌ను గత నెలలో ఆన్‌లైన్‌ మార్కెట్‌ కోసం విరాట్‌ కర్వ్‌ పేరుతో కంపెనీ పరిచయం చేసింది. లావా ఆరా కర్వ్ 5జిలో 6.67 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ త్రీడీ కర్వ్డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, గరిష్ఠంగా 1,100 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 1920 హెడ్జ్‌ పీడబ్ల్యూఎం డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌ వెనుక భాగంలో మరో చిన్న డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని ద్వారా నోటిఫికేషన్లు, మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ నియంత్రణలు, బ్యాటరీ స్థాయి, వినియోగదారులు ఎంచుకున్న టెక్స్ట్‌ను చూడవచ్చు.

భారీ బ్యాట‌రీ..

వెనుక ప్యానెల్‌కు వీగన్‌ లెదర్‌ ఫినిషింగ్‌ ఇచ్చారు. అంబర్‌ బ్లూ, హిమ్‌ సిల్వర్‌ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. మన్నిక కోసం ఐరన్‌గార్డ్‌ ప్రొటెక్షన్‌తోపాటు ఏఎల్‌-ఎస్‌ఐ డీటీ స్టార్‌ 2 కవర్‌ గ్లాస్‌ను అందించారు. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ ఉంది. అలాగే మిల్‌-ఎస్‌టీడీ-810హెచ్‌ మిలిటరీ గ్రేడ్‌ మన్నిక ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2.4 గిగాహెడ్జ్‌ వరకు క్లాక్‌ స్పీడ్‌తో పనిచేసే ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌ అంటుటు బెంచ్‌మార్క్‌ పరీక్షలో 8 లక్షలకు పైగా స్కోరు సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్నాయి. వర్చువల్‌ మెమరీ ఫీచర్‌ ద్వారా అదనంగా 6 జీబీ వరకు ర్యామ్‌ను విస్తరించుకోవచ్చు. ఇందులో 6,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 720 గంటల వరకు స్టాండ్‌బై సమయం లభిస్తుందని కంపెనీ తెలిపింది. 45 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ మద్దతు ఇస్తుంది. రిటైల్‌ బాక్స్‌లో 33 వాట్ల ఛార్జర్‌ను అందిస్తున్నారు.

వాయు ఏఐ ఫీచ‌ర్లు..

ఫొటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌ కోసం వెనుకవైపు 50 మెగాపిక్స‌ల్ సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరాను ఏర్పాటు చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (ఈఐఎస్‌) సదుపాయం ఉంది. 2కె రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్‌ చేయవచ్చు. ప్రొ వీడియో, నైట్‌ మోడ్‌, డ్యుయల్‌ వ్యూ వీడియో, మోషన్‌ ఫొటో, స్పోర్ట్స్‌ మోడ్‌ వంటి ఫీచర్లు కెమెరా యాప్‌లో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్స‌ల్‌ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అనవసరమైన థర్డ్‌ పార్టీ యాప్‌లు, ముందుగా పొందుపరిచిన ప్రకటనలు లేకుండా క్లీన్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తున్నట్లు లావా తెలిపింది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌లు, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అదనంగా కంపెనీకి చెందిన వాయు ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టీవీలు, ఎయిర్‌ కండిషనర్లు వంటి గృహోపకరణాలను నియంత్రించేందుకు ఇన్‌బిల్ట్‌ ఐఆర్‌ బ్లాస్టర్‌ను కూడా అందించారు.

ధ‌ర ఎంతంటే..

లావా ఆరా కర్వ్ 5జి స్మార్ట్‌ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.23,999గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా లావా ఆఫ్‌లైన్‌ రిటైల్‌ భాగస్వాముల ద్వారా మాత్రమే ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు కంపెనీ ఫ్రీ సర్వీస్‌ ఎట్‌ హోమ్‌ కార్యక్రమాన్ని కూడా అందిస్తోంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారుల ఇంటి వద్దకే అమ్మకాల అనంతర సేవలను అందించనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement