Malla Reddy | కమలం గూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి? ఎంత వరకు నిజం..!
Malla Reddy | మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వార్తలు షికారు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మల్లారెడ్డి, ఆయన కుమారుడు, కోడలు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Malla Reddy | త్రినేత్ర.న్యూస్ : మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వార్తలు షికారు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మల్లారెడ్డి, ఆయన కుమారుడు, కోడలు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక మల్లారెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి మోదీకి పరిచయం చేశారు. అయితే గత కొద్ది రోజులు మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొడుకు, కోడలు రాజకీయ భవిష్యత్తు కోసమే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
గతంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి తన కొడుకు, అల్లుడితో కలిసి సమావేశమైన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ టీడీపీ చీఫ్‌గా మల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. తన ఆస్తులను కాపాడుకునేందుకు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా వార్తలు షికారు చేశాయి. కానీ ఆయన ఇప్పటికీ పార్టీ మారలేదు.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్ పాలనపై మల్లారెడ్డి నిప్పులు చెరుగుతున్నారు.
అయితే హైదరాబాద్‌లోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి డీజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్‌ను గూగుల్‌తో కలిసి ప్రారంభించనున్నారు. జూన్‌లో ప్రారంభించనున్న ఆసియాలోనే అతిపెద్దదైన ఏఐ-ఏజెన్సీ క్యాంపస్‌కు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించినట్టు మాజీ మంత్రి మల్లారెడ్డి నిన్న మీడియాకు వివరించారు. ఇదే వాస్తవమైతే.. మల్లారెడ్డి బీఆర్ఎస్‌లోనే కొనసాగే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



