Jeevan Reddy with KCR | అన్నా.. నన్ను దేవుడే పంపిండు.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం
Jeevan Reddy with KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జగిత్యాల సీనియర్ నేత జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య ఉన్న నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న స్నేహాన్ని నెమరేసుకున్నారు. అన్నా నన్ను దేవుడే పంపిండు.. మీతో కలిసి పని చేయమని కేసీఆర్‌కు చెబుతూ జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
Jeevan Reddy with KCR | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జగిత్యాల సీనియర్ నేత జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య ఉన్న నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న స్నేహాన్ని నెమరేసుకున్నారు. అన్నా నన్ను దేవుడే పంపిండు.. మీతో కలిసి పని చేయమని కేసీఆర్‌కు చెబుతూ జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆప్యాయంగా పలుకరించారు. తదనంతరం ఆలింగనం చేసుకున్నారు.
ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. జీవన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలందించి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానినికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి., తెలంగాణ సాధకుడు రైతు బాంధవుడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు..అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’’ అంటూ తన మనసు మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.
కాగా...జీవన్ రెడ్డిని అనునయిస్తూ,వారిని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్, వారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆథిధ్యానికి కేసీఆర్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు.
జీవన్ రెడ్డి గారితోపాటు వచ్చిన వారిలో, వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులున్నారు.
అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని
కేసీఆర్‌ను కలిసి భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి pic.twitter.com/lhiH1xYrRM
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



