Harish Rao | బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించండి.. కిషన్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సాక్షిగా హరీశ్ రావు లేఖను విడుదల చేశారు. కోకాపేటలోని తన నివాసం వద్ద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నాను. సింగరేణి బొగ్గు గనుల్లో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. ఈ అవినీతి కుంభకోణాల గురించి మీడియా సాక్షిగా బయటపెట్టను. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న నువ్వు ఒకవేళ రేవంత్‌తో కుమ్మక్కు కాకపోతే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి బామ్మర్ది ఈ కుంభకోణాలను నడిపాడు.. కోల్ ఇండియాలో, గతంలో సింగరేణిలో మైనస్ 20 నుంచి 10 వరకు టెండర్లు పోతుండే. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత.. కాంట్రాక్టర్లను బెదిరించి కుంభకోణాలకు పాల్పడ్డాడు. నైని బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు ఈ టెండర్లను రద్దు చేసి సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా. వెంటనే బీజేపీ స్పందించాలని, దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని, ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతన్న నష్టాన్ని బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నాను. సింగరేణి డబ్బుతో రేవంత్ ఫుట్ బాల్ ఆడుతున్నాడు. షోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడడు అని హరీశ్‌రావు నిలదీశారు.


సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



