Harish Rao | ఏ పొక్కలో దాక్కున్నా పట్టుకొచ్చి విచారిస్తాం.. పోలీసులకు మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
Harish Rao | తెలంగాణ పోలీసు అధికారులను మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఇప్పుడు విచారణల పేరిట వేధిస్తున్న అధికారులను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
రిటైర్‌మెంట్ అయినా వదిలిపెట్టం..
సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొస్తాం..
రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ పోలీసు అధికారులను మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఇప్పుడు విచారణల పేరిట వేధిస్తున్న అధికారులను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టి మా మీద దాడులకు యత్నిస్తున్నారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవర్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా ఆ పోలీసులను వదిలిపెట్టేది లేదు. అంతకు అంత అనుభవిస్తారు. జాగ్రత్త ఆలోచించుకోండి అని హరీశ్‌రావు సూచించారు.
రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టం. రేపు అధికారంలోకి వచ్చే బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే చట్టబద్దంగా న్యాయబద్దంగా వ్యవహరించండి. దావోస్ నుంచి రేవంత్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్ లో కాదు, చట్ట ప్రకారం వ్యవహరించండి. తప్పుడు సూచనలు, తప్పుడు ఆదేశాలను పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. కుట్రలతో బిఆర్ఎస్ నాయకులను బెదిరించాలని చూస్తున్న రేవంత్ పన్నాగం ఇది. మేం తప్పు చేయలేదు, ఎవరికి భయపడేది లేదు. కేటీఆర్ ధైర్యంగా వెళ్లారు. అనేక సందర్భాల్లో బిఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం జరిగింది. ఆరోజు ఎందుకు కేసులు పెట్టలేదు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీస్తే, కేటీఆర్ మీద సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో వార్తల రాయిస్తే ఏం చేశారు. రేవంత్ రెడ్డి మీద కూడా అధికారులు విచారణ జరిపించాలి. అన్ని విషయాలు బయటకు రావాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



