త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ద‌ళితుల‌ను మోసం చేసిన చ‌రిత్ర రేవంత్ రెడ్డిదే : హ‌రీశ్‌రావు

Harish Rao | ద‌ళితుల‌ను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదే అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ద‌ళితుల విష‌యంలో మీ ప్రేమ మాట‌ల్లో ఉంటే.. మా ప్రేమ చేత‌ల్లో చూపించామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

S

Telangana | Published On Mar 29, 2026, 7.21 pm IST

Harish Rao | ద‌ళితుల‌ను మోసం చేసిన చ‌రిత్ర రేవంత్ రెడ్డిదే : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ద‌ళితుల‌ను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదే అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ద‌ళితుల విష‌యంలో మీ ప్రేమ మాట‌ల్లో ఉంటే.. మా ప్రేమ చేత‌ల్లో చూపించామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

ద‌ళితుల మీద ప్రేమ ఉన్న‌ట్టు, ఏదో ఉద్ధ‌రించిన‌ట్టు సీఎం మాట్లాడుతున్నాడు. దేశంలో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ డ‌బ్బులు ల్యాప్స్ కావొద్ద‌ని ఏదైనా ఒక ఏడాదిలో ఖ‌ర్చు పెట్ట‌క‌పోతే క్యారీ ఫార్వ‌ర్డ్ చేయాల‌ని చ‌ట్టం తెచ్చిన తొలి ప్ర‌భుత్వం కేసీఆర్ ప్ర‌భుత్వం. కేసీఆర్ చ‌ట్టం తెచ్చిన త‌ర్వాత ప‌ది రాష్ట్రాలు మన చ‌ట్టాన్ని కాపీ పేస్ట్ చేసుకుని అమ‌లు చేశాయి. ద‌ళిత గిరిజ‌నుల గురించి నిజాయితీగా ఆలోచించి చ‌ట్టం తెచ్చారు. ద‌ళిత బంధు తెచ్చింది కేసీఆర్ క‌దా..? అని హ‌రీశ్‌రావు అడిగారు.

2024-25లో ఎస్సీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ. 1395 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. అదే బీఆర్ఎస్ పార్టీ 2021-22లో రూ. 7361 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. ఎస్సీ కార్పొరేష‌న్ మీద రూ. 3267 కోట్లు కేటాయించి ఖ‌ర్చు పెట్టింది 28 కోట్లు మాత్ర‌మే.. ఇదేనా ద‌ళితుల మీద మీకున్న‌ ప్రేమ‌. ద‌ళిత‌బంధు ప‌థ‌కానికి సున్నా నిధులు కేటాయించావు. ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్‌లో రెండేండ్ల‌లో 40 శాతం కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. క‌ప‌ట ప్రేమ‌.. మొస‌లి క‌న్నీరు త‌ప్ప ఎస్సీ, ఎస్టీల మీద నిజ‌మైన ప్రేమ లేదు. బ‌డాబ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు డ‌బ్బులు ఇచ్చావు కానీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ నిధులు ఇవ్వ‌లేదు. ఎస్సీ డిక్ల‌రేష‌న్ అమ‌లు చేయ‌లేదు. ద‌ళిత గిరిజ‌నుల మోసం చేసిన చ‌రిత్ర రేవంత్ రెడ్డిది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement