త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జి చేత విచార‌ణ‌కు సిద్ధ‌మా..? రేవంత్‌కు హ‌రీశ్‌రావు స‌వాల్

Harish Rao | నా త‌మ్ముడు, బామ్మ‌ర్ది అవినీతికి పాల్ప‌డ్డారు.. హౌస్ క‌మిటీ వేసేందుకు హ‌రీశ్‌రావు రెడీ అని అడిగావు క‌దా.. నేను రెడీ. మ‌రి నువ్వు నీ తమ్ముళ్లు, నీ బామ్మ‌ర్ది కుంభ‌కోణాల మీద హౌస్ క‌మిటీ వేసేందుకు రెడీనా..? లేదంటే హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జి చేత విచార‌ణ‌కు సిద్ధ‌మా..? అని సీఎం రేవంత్‌కు హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Mar 29, 2026, 7.13 pm IST

Harish Rao | హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జి చేత విచార‌ణ‌కు సిద్ధ‌మా..? రేవంత్‌కు హ‌రీశ్‌రావు స‌వాల్
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : నా త‌మ్ముడు, బామ్మ‌ర్ది అవినీతికి పాల్ప‌డ్డారు.. హౌస్ క‌మిటీ వేసేందుకు హ‌రీశ్‌రావు రెడీ అని అడిగావు క‌దా.. నేను రెడీ. మ‌రి నువ్వు నీ తమ్ముళ్లు, నీ బామ్మ‌ర్ది కుంభ‌కోణాల మీద హౌస్ క‌మిటీ వేసేందుకు రెడీనా..? లేదంటే హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జి చేత విచార‌ణ‌కు సిద్ధ‌మా..? అని సీఎం రేవంత్‌కు హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

నా కుటుంబ స‌భ్యులు ధ‌ర‌ణిని ఉప‌యోగించి బాలాన‌గ‌ర్ మండ‌లంలో అవినీతికి పాల్ప‌డ్డాడు అన్నావు. నా బామ్మ‌ర్ది, నా త‌మ్ముడి మీద ఆరోప‌ణ‌లు చేశావు. హౌస్ క‌మిటీ వేసేందుకు హ‌రీశ్‌రావు రెడీనా అని అడిగావు క‌దా.. నేను రెడీ. నీ త‌మ్ముళ్లు చేసిన భూకుంభ‌కోణాల మీద, టీడీఆర్ కుంభ‌కోణాల మీద‌, కేఎల్ఎస్ఆర్ టెండ‌ర్ల కుంభ‌కోణాల మీద రెడీ అయితే.. నా త‌మ్ముడి మీద‌ నేను రెడీ. నా బామ్మ‌ర్ది మీద ఆరోప‌ణ చేశావు క‌దా.. నీ బామ్మ‌ర్ది సృజ‌న్ రెడ్డి చేసిన‌ అమృత్ టెండ‌ర్ల కుంభ‌కోణాల మీద‌, సింగ‌రేణిలో ఓబీ టెండ‌ర్ల‌లో చేసిన కుంభ‌కోణాల మీద‌ నువ్వు రెడీ అయితే నేను రెడీ రేవంత్ రెడ్డి. ఇంకో మాట చెబుతున్నా.. నేను చెప్పిన హౌస్ క‌మిటీ వ‌ద్దు.. నీవు చెప్పినా సీబీసీఐడీ వ‌ద్దు.. ఇద్ద‌రం క‌లిసి హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జి చేత విచార‌ణ జ‌రిపిద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా.. తోక‌ముడిచి పారిపోకు.. చిల్ల‌ర మాట‌లు మాట్లాడ‌కు. నీ చంచ‌గాళ్ల‌తో తిట్టించే ప్ర‌య‌త్నం చేయ‌కు.. దుమ్మంటే రా.. లేదంటే త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పు అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

నేను ఎన్న‌డూ ఫోన్ చేయ‌లేదు పొంగులేటికి. బీఆర్ఎస్ హ‌యాంలో పేద‌ల‌కు గృహ‌ల‌క్ష్మి ఇండ్లు ఇచ్చాం.. ఆ ఇండ్ల‌కు బిల్లులు రావ‌డం లేదు ఇబ్బంది ప‌డుతున్నారు దానిపై నిర్ణ‌యం తీసుకోండి అని మాట్లాడినం. ఏ ఫేవ‌ర్ కోసం ఏ ప‌ని కోసం ఫోన్ చేయ‌లేదు. ఆ చేసే చ‌రిత్ర మాకు లేదు.. నీకు నీ మంత్రుల‌కు ఉండొచ్చు. కానీ మాకు అటువంటిది లేదు అని హ‌రీశ్ రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement