Harish Rao | సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి రేవంత్.. హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఎముకలు కొరికే చలిని తట్టుకొని.. సహకార సంఘాల ఆఫీసుల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. అక్కడే చలి మంటలు వేసుకుని.. యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఎముకలు కొరికే చలిని తట్టుకొని.. సహకార సంఘాల ఆఫీసుల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. అక్కడే చలి మంటలు వేసుకుని.. యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ రైతన్నల బాధపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు.
సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందే అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. “అందరినీ తొక్కుకుంటూ వచ్చాను” అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు. నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా? అని హరీశ్‌రావు నిలదీశారు.
యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైంది? యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదేనా మీరు చెప్పిన “మార్పు” ? గత సీజన్‌లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందే.
“అందరినీ తొక్కుకుంటూ వచ్చాను” అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు.
నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు… pic.twitter.com/9ZLU4tce3v
— Harish Rao Thanneeru (@BRSHarish) December 26, 2025
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



