Harish Rao | 4 వేలకు అవకాశం ఉంటే 800 క్యూసెక్కులే ఎందుకు ఎత్తిపోస్తున్నవ్..?
Harish Rao | శ్రీశైలం నిండు కుండలా ఉన్నప్పటికీ.. పాలమూరును ఎందుకు ఎండబెడుతున్నావ్ అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు 800 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నవ్ అని సీఎంను నిలదీశారు.
ఏపీ సీఎంకు గురు దక్షిణ చెల్లించుకునేందుకా..?
పాలమూరును ఎండబెట్టడమే నీ ఉద్దేశమా..?
సాగునీటి నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : శ్రీశైలం నిండు కుండలా ఉన్నప్పటికీ.. పాలమూరును ఎందుకు ఎండబెడుతున్నావ్ అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు 800 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నవ్ అని సీఎంను నిలదీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఎల్‌నినో వల్ల కాదు కరువు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల కరువు. పక్క రాష్ట్రంలో ఎక్కడ క్రాప్ హాలిడే లేదు. తెలంగాణకు మాత్రం క్రాప్ హాలిడే ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు అదే గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. నీళ్లు లేక కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక. దీని వల్ల కరువు పరిస్థితుల వల్ల రైతాంగం కన్నీరు పెడుతుంది. రాజకీయ ఆరోపణ కాదు.. ఇది వాస్తవం. ఎందుకు ఇంత కచ్చితంగా చెబుతున్నానంటే.. ఉదాహరణకు మీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకోండి.. ఐదు మోటార్లు ఉన్నాయి.. ఒకటి లేదా రెండు మాత్రమే నడుపుతున్నారు.. మేం వస్తున్నామంటే మూడు నడుపుతున్నారు. అది కూడా రోజుకు 8 గంటలు మాత్రమే నడుపుతున్నారు. ఉదయం 8.30 గంటలకు మోటార్లు ఆన్ చేసి సాయంత్రం 4.30కు బంద్ చేస్తున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇది కాలం తెచ్చిన కరువా..? రేవంత్ రెడ్డి కరువా..?
నడపాల్సిన మోటార్లు 5, నడపుతున్నవి 3 మోటార్లు మాత్రమే. నడపాల్సింది 24 గంటలు.. నడుపుతున్నది 8 గంటలే. ఒక్కొక్క మోటారు నుంచి 800 క్యూసెక్కులు ఎత్తిపోసే అవకాశం ఉంది. అంటే 3 మోటార్ల ద్వారా 2400 క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం నుంచి తీసుకుని పాలమూరు జిల్లాకు ఇచ్చే అవకాశం ఉంది. 24 గంటలు ఐదు మోటార్లు నడిపిస్తే.. 800 క్యూసెక్కుల చొప్పున 4 వేల క్యూసెక్కులు తీసుకోవచ్చు. చేతగాని రేవంత్ దద్దమ్మ ప్రభుత్వం కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే తీసుకుంటుంది. ఇది కాలం తెచ్చిన కరువా..? రేవంత్ రెడ్డి కరువా..? మీరే చెప్పాలి. శ్రీశైలం నిండా నీళ్లు ఉన్నాయి. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు 800 కి.మీ. నీళ్లు తీసుకుపోయి కుప్పంలో పారిస్తున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో నీళ్లు పారిస్తుంటే.. రేవంత్ సొంత జిల్లాను ఎండబెడుతున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
చేతగాక, చేవలేక.. పంటలు ఎండబెతున్నారు
మన హక్కు కృష్ణా జిల్లాలు. మనం కృష్ణా బేసిన్‌లో ఉన్నాం. అయినా పంటలు ఎండిపోతున్నాయి. చేతగాక, చేవలేక అవకాశం ఉండి కూడా పంటలు ఎండబెతున్నారు. కల్వకుర్తి నుంచి ప్రతి రోజు 4 వేల క్యూసెక్కులు తీసుకునే వెసులుబాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. 30 ఏండ్లు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేదు.. కల్వకుర్తిని పండబెట్టాయి. కానీ కేసీఆర్ నాయకత్వంలో మొదటి టర్మ్‌లో పంపు హౌజ్‌ల వద్దనే పడుకుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు కరువు, వలస జిల్లాగా మార్చాయని హరీశ్‌రావు తెలిపారు.
నీ గురువుకు కుప్పం దాకా నీళ్లు అందవనా..?
ఉమ్మడి ఏపీలో బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద కేవలం 26 వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉండేది. కానీ ఐదేండ్లలోనే రూ. 4 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దద్దమ్మ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు.. కాలువ తవ్వింది లేదు. ఇవాళ కూడా శ్రీశైలంలో 96 టీఎంసీల వాటర్ ఉంది. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేరు. కట్‌క ఒత్తితే నీళ్లు వస్తాయి. ఎందుకు 800 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నవ్. ఈ జిల్లా బిడ్డగా పాలమూరకు ద్రోహం చేస్తున్నవ్. నీ గురువుకు కుప్పం దాకా నీళ్లు అందవనా..? ఎందుకు తీసుకుంటలేవు. 4 వేల క్యూసెక్కులకు అవకాశం ఉంటే ఎందుకు 800 క్యూసెక్కులకే పరిమితం అయినవ్. వెలిగొండ, పొతిరెడ్డిపాడుకు తక్కువ పడుతయ్.. గురువుకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తున్నావా..? గురుదక్షిణ చెల్లించాలనుకుంటున్నా..? పాలమూరును ప్రజలను ఎండబెట్టి ఏపీకి నీళ్లు పారిచండమే నీ ఉద్దేశమా..? మా ప్రభుత్వ హయాంలో ఇదే కల్వకుర్తిలో ఐదారు నెలలు ఐదు మోటార్లు నిరాంతరయంగా నడిపినం.. నువ్వు ఎందుకు నడపడం లేదు.. గోదావరిలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●GPT-6 Sol | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చాట్ జీపీటీ ధరలు తగ్గింపు..
- ●Kavitha Kalvakuntla RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మరణాలపై కవిత ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వానికి 30 రోజుల అల్టిమేటం
- ●Salakatla Brahmotsavams | ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సమష్టి కృషే కారణమన్న టీటీడీ చైర్మన్ నాయుడు..
- ●Adilabad RIMS Fire Accident | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి: సుమోటోగా కేసు స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్
- ●Brahmotsavam 2026 | వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం.. సుదర్శన చక్ర స్పర్శతో పావనమైన పుష్కరిణి జలాలు
- ●Telangana Employees | ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్

GPT-6 Sol | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చాట్ జీపీటీ ధరలు తగ్గింపు..

Kavitha Kalvakuntla RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మరణాలపై కవిత ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వానికి 30 రోజుల అల్టిమేటం

Salakatla Brahmotsavams | ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సమష్టి కృషే కారణమన్న టీటీడీ చైర్మన్ నాయుడు..

Adilabad RIMS Fire Accident | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి: సుమోటోగా కేసు స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్






