త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ రెడ్డి మీద అన‌ర్హ‌త వేటు వేయాలి.. హ‌రీశ్‌రావు డిమాండ్

Harish Rao | అన‌ర్హ‌త వేటు వేయాల్సి వ‌స్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కాదు.. సీఎం రేవంత్ రెడ్డి మీద వేయాల‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్ర‌మ మైనింగ్‌పై ప్ర‌శ్నించేందుకు బీఆర్ఎస్‌పై సీఎం ఎదురుదాడికి పాల్ప‌డ్డార‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 29, 2026, 6.32 pm IST

Harish Rao | రేవంత్ రెడ్డి మీద అన‌ర్హ‌త వేటు వేయాలి.. హ‌రీశ్‌రావు డిమాండ్
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : అన‌ర్హ‌త వేటు వేయాల్సి వ‌స్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కాదు.. సీఎం రేవంత్ రెడ్డి మీద వేయాల‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్ర‌మ మైనింగ్‌పై ప్ర‌శ్నించేందుకు బీఆర్ఎస్‌పై సీఎం ఎదురుదాడికి పాల్ప‌డ్డార‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో క‌లిసి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

నిన్న ఈ రోజు స‌భ‌లో ఒక్క విష‌యం మాత్రం స్ప‌ష్టంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. ఏందంటే పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్ప‌డింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జ‌నాకు నిధులు ఎగ్గొట్టింది. ఈ విష‌యం చ‌ర్చ చూసిన ప్ర‌తి ఒక్క‌రికి అర్థ‌మైంది. అంద‌రికంటే బాగా సీఎంకు, పొంగులేటికి అర్థ‌మైంది. స‌భ‌లోనే స్వ‌యంగా త‌ప్పు జ‌రిగింద‌ని సీఎం ఒప్పుకున్నారు. మంత్రి కంపెనీ అవినీతికి పాల్ప‌డింద‌ని మైనింగ్ మంత్రి వివేక్, సీఎం నిండు స‌భ‌లో ఒప్పుకున్నారు. అనుమ‌తుల్లేకుండా క్ర‌ష‌ర్ న‌డిపింది. సీన‌రేజీ ఫీజు ఎగ్గొట్టింంద‌ని స్ప‌ష్టంగా చెప్పారు. త‌ప్పు జ‌రిగింద‌ని అర్థ‌మైంది. ఇవాళ గ‌వ‌ర్న‌మెంట్ డిఫెన్స్‌లో ప‌డిపోయి సీఎం ఎదురుదాడికి, బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డుతున్నారు. అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు పాల్ప‌డ్డారు. మాకు మైక్ ఇవ్వ‌కుండా ఏక‌ప‌క్షంగా కాంగ్రెస్ స‌భ్యుల‌ను మాట్లాడించారు. వాళ్ల‌కు వారే సీబీ సీఐడీ, ఎథిక్స్ క‌మిటీ అని ప్ర‌క‌టించుకున్నారు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

ఉద్దేశ‌పూర్వ‌కంగానే కౌశిక్ రెడ్డి మీద దాడి

పూర్తిగా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్.. డిఫెన్స్‌లో ప‌డ్డారు కాబ‌ట్టి. స‌మాధానం లేదు క‌నుక మంత్రి కంపెనీ అవినీతికి పాల్ప‌డిన‌ట్టు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్ట‌ప‌గ‌లు ఆధారాల‌తో దొరికిపోయారు. అందువ‌ల్ల ఈ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్. ఏమ‌న్న అంటే ద‌ళిత్ యాంగిల్ తీసుకువ‌స్తున్న‌డు. ఇంకో వైపు కౌశిక్ మీద ఎథిక్స్ క‌మిటీ రిఫ‌ర్ చేస్తున్నారు. ఇది ప్ర‌శ్నించే గొంతుల మీద దాడి. అవినీతిని ప్ర‌శ్నిస్తున్నాడు.. గ‌ట్టిగా మాట్లాడుతున్న‌డు కాబ‌ట్టి ప‌గ బ‌ట్టిన‌ట్టు చేస్తున్నాడు సీఎం. పోలీసుల‌తో ఆయ‌న ఇంటి మీద‌ దాడి చేయించాడు. సీబీసీఐడీ ఎంక్వైరీ వేశారు. అనేక అక్ర‌మ కేసులు పెట్టారు. కేసులు అక్ర‌మ‌మ‌ని రిమాండ్ చేయ‌కుండా ప‌లుమార్లు బెయిల్ ఇచ్చింది కోర్టు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే కౌశిక్ రెడ్డి మీద దాడి జ‌రుగుతుంది. ఇది కౌశిక్ మీద కాదు ప్ర‌శ్నించే గొంతుల మీద దాడి, ప్ర‌జాస్వామ్యం మీద దాడి. ఎథిక్స్ క‌మిటీకి రిఫ‌ర్ చేస్తున్న అని సీఎం అంటున్నారు. అనాగ‌రిక భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఎథిక్స్ క‌మిటీకి రిఫ‌ర్ చేయాలి. బ‌డువా అనే భాష మాట్లాడారు రేవంత్ రెడ్డి. నోటితో చెప్ప‌లేని మాట‌లు అన్నారు. అస‌లు శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి అన‌ర్హ‌త వేటు వేయాల్సి వ‌స్తే ముందు రేవంత్ రెడ్డి మీద అన‌ర్హ‌త వేటు వేయాలి. దొంగే దొంగ అన్న‌ట్టు మీరు గొంతు బిగ్గ‌ర చేసుకుని మైకులు ఇవ్వ‌కుండా కౌశిక్ మీద ప‌గ‌బ‌ట్టి క‌క్ష‌తో ఎథిక్స్ క‌మిటీకి రిఫ‌ర్ చేసిన‌ట్టు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement