త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errabelli Dayakar Rao | ఆస్తుల‌ను లాక్కునే ప‌నిలో సీఎం రేవంత్ ప్ర‌భుత్వం

Errabelli Dayakar Rao | తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్( KCR ) కొత్త‌గా జిల్లాల‌ను ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు ఉన్న ఆస్తి విలువలు పెంచితే.. ఆ ఆస్తుల‌ను లాక్కునే ప‌నిలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్ర‌భుత్వం నిమ‌గ్న‌మైంద‌ని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు( Errabelli Dayakar Rao ) అన్నారు.

S

Telangana | Published On Oct 11, 2026, 5.06 pm IST

Errabelli Dayakar Rao | ఆస్తుల‌ను లాక్కునే ప‌నిలో సీఎం రేవంత్ ప్ర‌భుత్వం
Advertisement

Errabelli Dayakar Rao | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్( KCR ) కొత్త‌గా జిల్లాల‌ను ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు ఉన్న ఆస్తి విలువలు పెంచితే.. ఆ ఆస్తుల‌ను లాక్కునే ప‌నిలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్ర‌భుత్వం నిమ‌గ్న‌మైంద‌ని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు( Errabelli Dayakar Rao ) అన్నారు. జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చంపకిల్స్‌లోని మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్బంగా ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. జిల్లాకో మెడికల్ కాలేజీ తెచ్చి, ప్రజల ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచి కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ అయితే.. క‌నీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక‌ వసతులు కల్పించలేని దుర్మార్గ‌ పాలన నేడు రేవంత్ నాయ‌క‌త్వంలో న‌డుస్తుంది. జనగామ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమాలు, ధర్నాలు రాస్తారోకోలు జరిగాయి. జిల్లా ఏర్పాటు కాకుండా కడియం శ్రీహరి అనేక ప్రయత్నాలు చేసిన కేసీఆర్ జనగామ జిల్లా ఏర్పాటు చేశారని ద‌యాక‌ర్ రావు తెలిపారు.

రాష్ట్రంలో జనగామ ప్రాంతం అంటే ఎడారి ప్రాంతం అనే వారు, అదే తెలంగాణ వచ్చక వరి సాగులో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. 2014 రాష్ట్రం ఏర్పడ్డాక‌ జనగామ కరువు ప్రాంతానికి మోక్షం కల్పించి దేవాదుల నీటిని విడుదల చేసి సస్యశ్యామ‌లం చేసిన చరిత్ర కేసీఆర్‌ది. జిల్లా కలెక్టర్ కార్యాలయం, మాత శిశు ఆసుపత్రి, మెడికల్ కళాశాల, బతుకమ్మ కుంట, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి జిల్లా కేంద్ర అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు.

అంతే కాకుండా పాలకుర్తిలోని వల్మిడి రామాలయం, సోమేశ్వర ఆలయం, పోతన ఆడిటోరియం, సోమనాథుని కళాపీఠం, లింగాల ఘనపూర్ మండలంలో జీడికల్ ఆలయం, బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గుట్ట,చిల్పూర్ మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వంటిని ఆధ్యాత్మిక సందర్శనా ప్రాంతాలుగా అభివృద్ధి చేశార‌ని తెలిపారు.

స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీ చేసి టౌన్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపారు కేసీఆర్. ఇంకా మనం అభివృద్ధి చేసుకునేది ఉంది. వచ్చే రెండు ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తాది అప్పుడు మన జనగామ రూపు రేఖలు మార్చుకుందాం. జిల్లా కొరకు అనేక మంది ఉద్యమం చేసి సాధించే వరకు పోరాటం చేశారు. వారి కృషితోనే నేడు మన జనగామ జిల్లా అయింద‌ని ద‌యాక‌ర్ రావు పేర్కొన్నారు.

ఈ వేడుకలో రాజ్యాసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జనగామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, జిల్లా, మండల, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement