త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | పట్టణీకరణ సవాల్ కాదు.. అవ‌కాశం

PM Modi | పట్టణీకరణను స‌వాల్‌గా కాకుండా అవకాశంగా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆధునిక నగరాల అభివృద్ధికి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. 2014లో దేశంలోని ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు ప్రస్తుతం 25 నగరాలకు విస్తరించాయని వెల్లడించారు. తమిళనాడులో రూ.13వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. అనంత‌రం చెన్నైలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

P

National | Published On Oct 11, 2026, 4.27 pm IST

PM Modi | పట్టణీకరణ సవాల్ కాదు.. అవ‌కాశం
Advertisement
  • దేశంలో 25 న‌గ‌రాల‌కు మెట్రోసేవ‌ల విస్త‌ర‌ణ‌
  • మొబైల్ ఫోన్ల త‌యారీలో రెండోస్థానంలో భార‌త్‌
  • ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
  • చెన్నైలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌
  • త‌మిళ‌నాడులో రూ.13వేలతో ప‌నులు

PM Modi | పట్టణీకరణను స‌వాల్‌గా కాకుండా అవకాశంగా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆధునిక నగరాల అభివృద్ధికి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. 2014లో దేశంలోని ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు ప్రస్తుతం 25 నగరాలకు విస్తరించాయని వెల్లడించారు. తమిళనాడులో రూ.13వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. అనంత‌రం చెన్నైలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

యువతకు ఉపాధి అవకాశాలు

మొబైల్‌ ఫోన్ల తయారీలో భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని మోదీ తెలిపారు. 2014తో పోలిస్తే దేశ ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు 11 రెట్లు, రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని చెప్పారు. ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. తయారీ రంగంలో వృద్ధి యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. తమిళనాడులో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజల ప్రయాణాలను సులభతరం చేయడంతోపాటు పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు ఊతమిస్తాయని మోదీ చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రాల ఆకాంక్షలను అర్థం చేసుకున్నానని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుసుకున్న అనుభవంతో ప్రధానిగా ప్రతి రాష్ట్రం తన అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి నుంచి దేశాభివృద్ధి దిశగా సాగడమే తన నినాదమని స్పష్టం చేశారు.

మౌలిక సదుపాయాల విస్తరణ

రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి రహదారుల విస్తరణ ఒక్కటే సరిపోదని మోదీ అన్నారు. ఆధునిక నగరాలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అవసరమని చెప్పారు. దేశంలో ఓడరేవుల మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ నౌకాయాన రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర రవాణా, పారిశ్రామిక, వాణిజ్య రంగాల పురోగతికి దోహదం చేస్తాయని మోదీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement