త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thippiri Tirupathi | ఇంట‌ర్ తెలుగు పుస్త‌కంతో మాజీ మావోయిస్టు కుస్తీ..! ఎందుకో తెలుసా..?

Thippiri Tirupathi | ఆయ‌న మాజీ మావోయిస్టు అగ్ర నేత‌. నాలుగు ద‌శాబ్దాల క్రితం అడ‌వి బాట ప‌ట్టిన ఆయ‌న కొద్ది రోజుల క్రితమే జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిశారు. 62 ఏళ్ల వ‌య‌సులో లొంగిపోయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు చ‌దువుకోవాల‌నే కోరిక పుట్టింది. డిగ్రీలో ప్ర‌వేశం పొందేందుకు సిద్ధ‌మ‌య్యారు.

S

Telangana | Published On May 7, 2026, 6.44 am IST

Thippiri Tirupathi | ఇంట‌ర్ తెలుగు పుస్త‌కంతో మాజీ మావోయిస్టు కుస్తీ..! ఎందుకో తెలుసా..?
Advertisement

Thippiri Tirupathi | త్రినేత్ర‌.న్యూస్ : ఆయ‌న మాజీ మావోయిస్టు అగ్ర నేత‌. నాలుగు ద‌శాబ్దాల క్రితం అడ‌వి బాట ప‌ట్టిన ఆయ‌న కొద్ది రోజుల క్రితమే జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిశారు. 62 ఏళ్ల వ‌య‌సులో లొంగిపోయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు చ‌దువుకోవాల‌నే కోరిక పుట్టింది. డిగ్రీలో ప్ర‌వేశం పొందేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రంలో తెలుగు స‌బ్జెక్టులో ఫెయిల‌య్యారు. దాంతో తెలుగు పాసైతే కానీ.. ఆయ‌న డిగ్రీలో చేర‌లేరు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు తెలుగు ప‌రీక్ష రాసేందుకు అనుమ‌తివ్వాల‌ని కోరుతూ ఇంట‌ర్ బోర్డును ఆశ్ర‌యించారు. మ‌రోవైపు తెలుగు పుస‌క్తంతో కుస్తీ ప‌ట్టారు ఆ మాజీ మావోయిస్టు.

తెలంగాణ‌లోని కోరుట్ల‌కు చెందిన తిప్పిరి తిరుప‌తి అలియాస్ దేవ్‌జీ(62) 1983లో కోరుట్ల ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలో ఇంట‌ర్ ఎంపీసీ అభ్య‌సించారు. ఇంట‌ర్ సెకండియ‌ర్‌లో ఇంగ్లీష్‌, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించారు. కానీ తెలుగు స‌బ్జెక్టులో ఫెయిల‌య్యారు. ఇక ఆ త‌ర్వాత తెలుగు ప‌రీక్ష రాయకుండానే అడ‌వి బాట ప‌ట్టారు.

సీన్ క‌ట్ చేస్తే.. తిప్పిరి తిరుప‌తితో పాటు ప‌లువురు మావోయిస్టు అగ్ర‌నేత‌లు కొద్ది రోజుల క్రితం తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిన దేవ్‌జీకి మ‌ళ్లీ త‌న చ‌దువును కొన‌సాగించాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. దాంతో డిగ్రీలో చేరేందుకు అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ అధికారుల‌ను సంప్ర‌దించ‌గా, ఇంట‌ర్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా త‌ప్ప‌నిస‌రిగా పాసై ఉండాల‌ని చెప్పారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారుల‌ను దేవ్ జీ సంప్ర‌దించారు. తాను ఇంట‌ర్‌లో తెలుగు స‌బ్జెక్టు ఫెయిల‌య్యాను.. మ‌ళ్లీ రాసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించండి అని కోరారు. దేవ్‌జీ ప్ర‌తిపాద‌న‌పై ఇంట‌ర్ బోర్డు అధికారులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. మే 4వ తేదీ వ‌ర‌కు రూ. 3 వేల ఆల‌స్య రుసుంతో ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ఫీజు చెల్లించే అవ‌కాశం క‌ల్పించారు. కానీ దేవ్‌జీ ఫీజు చెల్లించ‌లేదు. ఇక ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఎగ్జామ్స్ మే 13 నుంచి ప్రారంభం కానున్నాయి.

Advertisement
Advertisement