BRAOU | డిజిటల్ విద్యా సంస్థగా అంబేద్కర్ యూనివర్సిటీ : వీసీ ఘంటా చక్రపాణి
BRAOU | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమగ్ర డిజిటల్ విద్యా సంస్థగా ఎదగడానికి కార్యాచరణను వేగవంతం చేస్తోందని విశ్వవిద్యాలయ వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. సంస్థాగత అభివృద్ధి ప్రణాళికను క్రమబద్ధంగా అమలు చేయడం ద్వారా విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.
BRAOU | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమగ్ర డిజిటల్ విద్యా సంస్థగా ఎదగడానికి కార్యాచరణను వేగవంతం చేస్తోందని విశ్వవిద్యాలయ వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. సంస్థాగత అభివృద్ధి ప్రణాళికను క్రమబద్ధంగా అమలు చేయడం ద్వారా విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. విద్యా వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, సమగ్ర అధ్యయనం అనంతరం రూపొందించిన “ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఐడీపీ)”ను పూర్తి స్థాయిలో అమలు చేస్తే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం విశ్వవిద్యాలయం తన కార్యకలాపాల ఐదవ దశాబ్దంలోకి ప్రవేశించిందని, ఈ కాలాన్ని పరివర్తన దశాబ్దంగా పేర్కొనవచ్చని ప్రొఫెసర్ చక్రపాణి పేర్కొన్నారు. సాంప్రదాయ విద్యా కార్యక్రమాలతో పాటు ఉపాధి అవకాశాలను పెంచే నైపుణ్య ఆధారిత కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. విద్యార్థినే కేంద్ర బిందువుగా తీసుకుని విశ్వవిద్యాలయం అన్ని విభాగాల్లో నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అకడమిక్ వ్యవహారాలు, విద్యార్థి సేవలు, పరిపాలనా సేవలు, సాంకేతిక సేవలు, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి ఐదు ప్రధాన విభాగాల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థాగత అభివృద్ధి సమగ్ర ప్రణాళిక (2026–2036)ని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఇతర డైరెక్టర్లు, డీన్లతో కలిసి ఆవిష్కరించారు. అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీవీఈటీ) గుర్తింపుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తును విజయవంతంగా సమర్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమానికి అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీ పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, ఓఎస్డీ ప్రొ రవీంద్రనాథ్ సోలమన్, ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, ప్రొఫెసర్ పీ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎన్ రజని, ప్రొఫెసర్ కే శ్రీదేవి, డాక్టర్ వై వెంకటేశ్వర్లు, బోధనేతర సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్‌తో పాటు వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




