Satyavathi Rathod | ప్రభుత్వ పథకం ఏదొచ్చినా ఆడవారి పేరు మీదే ఇచ్చారు
Satyavathi Rathod | కేసీఆర్ పాలనలో మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించారని.. ప్రభుత్వ పథకం ఏదొచ్చినా ఆడవారి పేరు మీదే ఇచ్చేవారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఈనెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ మహిళ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఆదివారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు.
- గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod | త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ పాలనలో మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించారని.. ప్రభుత్వ పథకం ఏదొచ్చినా ఆడవారి పేరు మీదే ఇచ్చేవారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఈనెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ మహిళ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఆదివారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది మహిళలలకు ఉచితంగా కుట్టు మెషిన్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చిన సందర్భంగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడారు. కుట్టు మెషిన్లు నేర్చుకుంటే భవిష్యత్‌లో ఒకరి మీద ఆధారపడకుండా జీవించడం సులభమవుతుంది. ప్రభుత్వ పథకం ఏదొచ్చినా అది ఆడవారి పేరు మీదే ఇచ్చే వారు. కల్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, రేషన్ కార్డు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, దళిత బంధు బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి పథకాలతో మహిళలకు మేలు జరిగింది. బీఆర్ఎస్ పాలనలో అర్ధరాత్రి వేళల్లో కూడా మహిళలు ధైర్యంగా బయటికి వెళ్లేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. మహిళలకు రక్షణ కరువైంది. కేసీఆర్ హయాంలో షీ టీమ్స్ తో మహిళల రక్షణకు భరోసా పెరిగింది అని సత్యవతి చెప్పారు.
అనంతరం జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. మహిళలు స్వతంత్రంగా ఎదగాలన్నారు. విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో మహిళలు రాణించాలని సూచించారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎంఎస్ అధ్యక్షురాలు డి. పద్మ, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!






