త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Salesforce | ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డేటా లీక్.. స్పందించిన‌ సేల్స్‌ఫోర్స్..

Salesforce | ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాహన రుణ ఖాతాదారుల డేటా లీక్ వ్యవహారంలో తమ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి భద్రతా లోపాన్ని గుర్తించలేదని సేల్స్‌ఫోర్స్ ప్రకటించింది. మరోవైపు, హ్యాకర్లు కేవైసీ వివరాలు, ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు సహా కీలక సమాచారాన్ని దొంగిలించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై బ్యాంకు దర్యాప్తు కొనసాగిస్తోంది.

S

Business | Published On Oct 31, 2026, 4.50 pm IST

Salesforce | ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డేటా లీక్.. స్పందించిన‌ సేల్స్‌ఫోర్స్..
Advertisement

Salesforce | ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాహన రుణ ఖాతాదారుల డేటా లీక్ వ్యవహారంలో తమ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి భద్రతా లోపాన్ని గుర్తించలేదని సేల్స్‌ఫోర్స్ ప్రకటించింది. మరోవైపు, హ్యాకర్లు కేవైసీ వివరాలు, ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు సహా కీలక సమాచారాన్ని దొంగిలించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై బ్యాంకు దర్యాప్తు కొనసాగిస్తోంది.

ప్రముఖ టెక్నాలజీ సంస్థ సేల్స్‌ఫోర్స్ శనివారం కీలక ప్రకటన చేసింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారుల డేటా లీక్ వ్యవహారానికి సంబంధించి తమ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి భద్రతా లోపాన్ని గుర్తించలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి సాంకేతిక లోపం బయటపడలేదని పేర్కొంది. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం) సేవలను అందించే ఈ సంస్థ, నిర్దిష్ట కస్టమర్లకు సంబంధించిన సమస్యలపై సాధారణంగా వ్యాఖ్యానించబోమని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు తమ బృందాలు కస్టమర్లతో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించింది.

డేటా లీక్ అనుమానాల‌పై ద‌ర్యాప్తు..

ఒకరోజు ముందు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన వాహన రుణ ఖాతాదారులకు సంబంధించిన డేటా లీక్ అనుమానాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించింది. సేల్స్‌ఫోర్స్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (SaaS) ప్లాట్‌ఫామ్‌లో వాహన రుణ కస్టమర్లకు సంబంధించిన పరిమిత సమాచారం ఉందని, ఆ డేటా లీక్ అయి ఉంటుంద‌నే అనుమానంతో విచారణ చేపట్టినట్లు బ్యాంకు తెలిపింది. అయితే తమ సొంత బ్యాంకింగ్ వ్యవస్థలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, అన్ని బ్యాంకింగ్ సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.

హ్యాకింగ్ చేశామ‌ని చెప్పిన గ్రూప్‌..

హ్యాకింగ్ ల‌కు పాల్ప‌డే స్కార్లెట్‌గ్రూప్ తమ సైబర్ రక్షణ వ్యవస్థలను ఛేదించినట్లు ప్రకటించిందని సైబర్ ముప్పుల విశ్లేషణ సంస్థ హ్యాక్‌మానాక్ వెల్లడించింది. కేవైసీ రికార్డులు, ఆధార్, పాన్ వివరాలు, క్రెడిట్ రిపోర్టులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, రుణ దరఖాస్తులు, సంతకం చేసిన ఒప్పందాలు, బీమా రికార్డులు, ఉద్యోగుల సమాచారం, లాగిన్ చరిత్ర, ఆడిట్ లాగ్స్ వంటి కీలక సమాచారం తమ వద్ద ఉన్నట్లు హ్యాకర్లు పేర్కొన్నారని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఇంకా స్వతంత్రంగా ధ్రువీకరించాల్సి ఉందని హ్యాక్‌మానాక్ స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో దేశంలోని పలు బ్యాంకింగ్ సంస్థలపై సైబర్ దాడుల ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ సహా మరికొన్ని సంస్థలు కూడా సైబర్ ముప్పు ప్రభావానికి గురై ఉంటాయ‌నే వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 25న భువనేశ్వర్‌లో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన రూ.169 కోట్ల డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ శిక్షణ సంస్థను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సైబర్ దాడులపై హెచ్చరించారు. భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని, ఈ అంశంపై అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్:

AU Small Finance BankCyber AttackData LeakHackmanacKYC DataSalesforceScarlettGroup
Advertisement
Advertisement