Etela Rajender vs Bandi Sanjay | బండి, ఈటల మధ్య సయోధ్య..! ఇకనైనా కలిసి పని చేసేనా..?
Etela Rajender vs Bandi Sanjay | రాష్ట్ర బీజేపీ రాజకీయాల్లో గ్రూప్ పాలిటిక్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ ఇద్దరి ఎంపీల మధ్య ముదిరిన రాజకీయ తగాదాలకు చెక్ పెట్టేందుకు మరో ఎంపీ చొరవ తీసుకున్నారు.
Etela Rajender vs Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర బీజేపీ రాజకీయాల్లో గ్రూప్ పాలిటిక్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ ఇద్దరి ఎంపీల మధ్య ముదిరిన రాజకీయ తగాదాలకు చెక్ పెట్టేందుకు మరో ఎంపీ చొరవ తీసుకున్నారు. ఇప్పుడైనా ఆ ఇద్దరు ఎంపీల మధ్య సయోధ్య కుదిరి కాషాయ పార్టీ బలోపేతం కోసం కృషి జరిగేనా అని రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.
మరి ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలు ఎవరంటే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్. మరి వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు చొరవ తీసుకున్న బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్.
శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని ఎంపీ లక్ష్మణ్ ఇంటి వద్ద బండి సంజయ్, ఈటల రాజేందర్ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఈటల, బండి ఆలింగనం చేసుకుని నవ్వుతూ కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్ష్మణ్ ఇంట్లోకి వెళ్లారు.
లక్ష్మణ్ నివాసంలో మొత్తానికి ఇద్దరినీ పక్కపక్కన కూర్చోబెట్టారు. ఇరువురి మధ్య నెలకొన్న రాజకీయ వివాదాల పరిష్కారంతో పాటు వ్యక్తిగత అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఇరువురి ఇంటర్నల్ వార్‌కు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడైనా వీరిద్దరి మధ్య నెలకొన్న వైరానికి చెక్ పడినట్టేనా..? ఇకనైనా కలిసి పని చేస్తారా..? లేదా? అని జోరుగా చర్చ జరుగుతోంది.
నువ్వా నేనా ❎
నువ్వు నేను ✅తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్
ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయనకు, బండి సంజయ్ మధ్య ఇంటర్నల్ వార్
ఈ మధ్య ఇరు వర్గాల మధ్య గొడవలు ముదురుతున్న నేపథ్యంలో.. ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇద్దరితో చర్చ
డాక్టర్ లక్ష్మణ్ నివాసంలో చర్చల… pic.twitter.com/moJGpCPfdg
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 18, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..
- ●Shooting at Food Festival | ఫుడ్‌ఫెస్టివల్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం
- ●Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
- ●Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
- ●Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
- ●UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు

Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..

Shooting at Food Festival | ఫుడ్‌ఫెస్టివల్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం

Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ




