త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | రాష్ట్రంలో రౌడీ రాజ్యం?.. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి?: బండి సంజ‌య్ ఫైర్‌

andi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తున్న‌దా? ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు.

G

Telangana | Published On Feb 22, 2026, 9.38 am IST

Bandi Sanjay | రాష్ట్రంలో రౌడీ రాజ్యం?.. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి?: బండి సంజ‌య్ ఫైర్‌
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తున్న‌దా? ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. ఎమర్జెన్పీ రోజులు ప్రారంభమయ్యాయని.. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధకావాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

`కాంగ్రెస్ రెండేండ్ల‌ పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోండి. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గం. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషం. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసిందే కాంగ్రెస్‌. ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటు. బాన్సువాడలో 70 మందిని అరెస్ట్ చేయడం అక్రమం. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యలేవి?. బాన్సువాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయం. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అని బండి సంజ‌య్ ఆరోపించారు.

Advertisement
Advertisement