త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Education Week Celebrations | విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి..

Education Week Celebrations | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి నుంచి 17 వరకు విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On May 9, 2026, 9.45 pm IST

Education Week Celebrations | విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి..
Advertisement

Education Week Celebrations | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి నుంచి 17 వరకు విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యా వారోత్సవాలు, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్, ఫార్మర్ రిజిస్ట్రీ, తదితర అంశాలపై, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించగా రాజ‌న్న సిరిసిల్ల నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ప్రణాళికకు అనుగుణంగా నిర్వహించాలన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. జనగణన ప్రక్రియకు సంబంధించి, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే తరలింపు చేపట్టాలని వివరించారు. తగినన్ని గన్ని సంచులు, లారీలు, తగినంతమంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, డీఐఈఓ శరత్, సీపీఓ శ్రీనివాస చారి, డీఏఓ అఫ్జల్ బేగం, డీటీఓ లక్ష్మణ్, డీసీఓ రామకృష్ణ, పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, సహాయ లేబర్ అధికారి నజీర్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement