త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Krishna Rao | కేటీఆర్ హ‌యాంలో మూడు వంతెన‌లు 18 నెల‌ల్లోనే పూర్తి చేశాం: మాధవరం కృష్ణారావు

MLA Krishna Rao | కేటీఆర్‌ మున్సిపల్‌ మంత్రిగా ఉన్నప్పుడు మూడు వంతెన‌లు (Three bridges) , అండర్‌పాసులు 18 నెలల్లోనే పూర్తి చేశామ‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫతేనగర్‌ వంతెన (Fathenagar bridge) ఇంకా పూర్తి చేయట్లేదని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Mar 24, 2026, 2.47 pm IST

MLA Krishna Rao | కేటీఆర్ హ‌యాంలో మూడు వంతెన‌లు 18 నెల‌ల్లోనే పూర్తి చేశాం: మాధవరం కృష్ణారావు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కేటీఆర్‌ మున్సిపల్‌ మంత్రిగా ఉన్నప్పుడు మూడు వంతెన‌లు (Three bridges) , అండర్‌పాసులు 18 నెలల్లోనే పూర్తి చేశామ‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫతేనగర్‌ వంతెన (Fathenagar bridge) ఇంకా పూర్తి చేయట్లేదని విమ‌ర్శించారు. అంబేడ్కర్‌ జంక్షన్‌కు రూ.300 కోట్ల నిధులు మంజూరయ్యాయ‌ని తెలిపారు. ఓడిపోయిన వ్యక్తి ఫొటోను వేదికపై పెట్టి త‌న‌ను అవమానించారని వాపోయారు. ప్రతి నియోజకవర్గంలో ఇలానే అవమానిస్తున్నారని మండిప‌డ్డారు.

హైదరాబాద్ లో ట్రాఫిక్‌ సమస్యకు ప‌రిష్కారం చూపాలి: సుధీర్‌రెడ్డి

హైదరాబాద్‌ అభివృద్ధి జరగాలంటే ట్రాఫిక్‌ సమస్యకు ముందు ప‌రిష్కారం చూపాల‌ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తీనాపురంలోని ఫ్లైఓవర్‌ను వదిలిపెట్టి మందమల్లమ్మ ఫ్లైఓవర్‌ చేపట్టాలని నిర్ణయించిన‌ట్లు చెప్పారు. ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఫ్లైఓవర్‌ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాల‌ని కోరారు. తాము మూసీ అభివృద్ధిని వ్యతిరేకించట్లేదని.. కానీ పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని డిమాండ్ చేశారు.

త‌ట్టెడు మ‌ట్టి కూడా ప‌డ‌లే.. సబితా ఇంద్రారెడ్డి

వివిధ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని, అయిన‌ప్ప‌టికీ త‌ట్టెడు మ‌ట్టి కూడా ప‌డ‌లేద‌ని ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి విమ‌ర్శించారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ణాళిక ప్రకారమే అభివృద్ధి జరుగుతుంద‌ని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement