త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రూ. 3,296 కోట్ల రేడియ‌ల్ రోడ్ల కుంభ‌కోణంపై సీఎం స‌మాధానం చెప్పాలి

KTR | కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt )లో చోటు చేసుకుంటుకున్న కుంభ‌కోణాల‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) బ‌య‌ట‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో కుంభ‌కోణాన్ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) బ‌య‌ట‌పెట్టారు.

S

Telangana | Published On Oct 10, 2026, 6.20 pm IST

KTR | రూ. 3,296 కోట్ల రేడియ‌ల్ రోడ్ల కుంభ‌కోణంపై సీఎం స‌మాధానం చెప్పాలి
Advertisement

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్

KTR | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt )లో చోటు చేసుకుంటుకున్న కుంభ‌కోణాల‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) బ‌య‌ట‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో కుంభ‌కోణాన్ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) బ‌య‌ట‌పెట్టారు. రూ.3,296 కోట్ల రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎంకు బ‌హిరంగ లేఖ రాశారు.

బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కానీ పనుల్ని ప్యాకేజీలుగా, ముక్కలుగా చేసి నచ్చిన వారికే కట్టబెట్టార‌ని కేటీఆర్ ఆరోపించారు. నచ్చినవారికి అక్రమంగా కట్టబెట్టిన టెండర్లలో వందల కోట్ల అవినీతి జ‌రిగింద‌న్నారు. ముందస్తుగా నిర్ణయించుకున్న వారికే టెండర్లు కట్టబెట్టారు. వెంటనే టెండర్లను రద్దుచేసి అక్రమాలపై విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు.

ప్రతి అనర్హతకు నిర్దిష్ట కారణాలను పేర్కొంటూ సాంకేతిక మూల్యాంకన నివేదికను విడుదల చేయాలి. మూడు ప్యాకేజీల ఆర్థిక వివరాలను వెల్లడించాలి. అంచనా వ్యయాలు, తుది కేటాయింపు విలువలు, అర్హత సాధించిన ప్రతి బిడ్డర్ ఆర్థిక బిడ్ వివరాలను విడుదల చేయాలి. రేడియల్ రోడ్ల టెండర్ల రికార్డులను బహిర్గతం చేయాలి. బిడ్ ఓపెనింగ్ స్టేట్‌మెంట్లు, కంపారిటివ్ స్టేట్‌మెంట్లు, మూల్యాంకన కమిటీ సమావేశాల మినిట్స్‌ను వెల్లడించాలి. రూ.600 కోట్ల ఆర్థిక నష్టం ఆరోపణపై సమగ్ర విచారణ జరపాలి. ధరల వ్యత్యాసాలు, బిడ్ల వివరాలు, తుది కేటాయింపులపై పూర్తిస్థాయి పరిశీలన జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. గత మూడేళ్లలోని భారీ కాంట్రాక్టులపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్ చేపట్టిన రూ.100 కోట్లకు పైబడిన కాంట్రాక్టులపై ఆడిట్ జరిపించాలి. టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బిడ్డర్లు, అనర్హతలు, అంచనా వ్యయాలు, తుది కేటాయింపు ధరలు, కాంట్రాక్టులు పొందిన సంస్థల వివరాలను వెల్లడించాలి. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలి. సాంకేతిక అర్హతలపై నిర్ణయాలు తీసుకునే విధానం, బిడ్డర్లు వివరణ ఇచ్చేందుకు కల్పించే అవకాశం, సాంకేతిక ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆర్థిక బిడ్లు తెరవడానికి అనుసరించే వ్యవధిపై స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement