త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Shivdhar Reddy | ఖైదీలను జైళ్ల సిబ్బంది గౌరవంతో చూడాలి : డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivdhar Reddy | జైళ్ల శాఖ సిబ్బంది ఖైదీలను గౌరవంతో చూడాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. జైళ్ల శాఖ పాత్ర సమాజానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. చంచల్ గూడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన జైళ్ల సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

S

Telangana | Published On Apr 29, 2026, 4.50 pm IST

DGP Shivdhar Reddy | ఖైదీలను జైళ్ల సిబ్బంది గౌరవంతో చూడాలి : డీజీపీ శివధర్ రెడ్డి
Advertisement

DGP Shivdhar Reddy | త్రినేత్ర.న్యూస్ : జైళ్ల శాఖ సిబ్బంది ఖైదీలను గౌరవంతో చూడాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. జైళ్ల శాఖ పాత్ర సమాజానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. చంచల్ గూడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన జైళ్ల సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివధర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్లో ఉద్యోగం అనేది సులభమైన పనికాదన్నారు. జైలు సేవ అనేది కేవలం నాలుగు గోడల మధ్య తాళాలు వేసే పని కాదని చెప్పారు. అది ఖైదీలను సరిదిద్దుతూ సమాజంలో తిరిగి కలిపే మహత్తరమైన బాధ్యత అని పేర్కొన్నారు. సిబ్బంది క్రమశిక్షణ, నిష్పక్షపాతం, వృత్తిపరమైన నైపుణ్యాలను పాటించాలని సూచించారు. జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సంస్కరణ పరిపాలనలో పరస్పర సహకారానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. ఈ ఏడాది మొత్తం 381 మంది ఢిల్లీ సిబ్బందికి దశలవారీగా శిక్షణకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుత శిక్షణలో మొత్తం 62 మంది ఉన్నారని, వారిలో 61 మంది ఢిల్లీకి చెందినవారు కాగా, మరొకరు తెలంగాణకు చెందిన వారని వివరించారు. మరొకరు అండమాన్, నికోబార్ దీవులకు చెందిన వ్యక్తి త్వరలోనే శిక్షణలో చేరుతారని పేర్కొన్నారు. ఈ తొమ్మిది నెలల సమగ్ర శిక్షణలో వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణ, మానవతా దృక్పథాన్ని పెంపొందించే రూపొందించబడిందని చెప్పారు.

Advertisement
Advertisement