త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP CV Anand | గ్రేహౌండ్స్ శిక్ష‌ణ మెరుగుప‌రుచాలి : డీజీపీ సీవీ ఆనంద్‌

P

Telangana | Published On May 14, 2026, 5.25 pm IST

DGP CV Anand | గ్రేహౌండ్స్ శిక్ష‌ణ మెరుగుప‌రుచాలి : డీజీపీ సీవీ ఆనంద్‌
Advertisement

DGP CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ గురువారం గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎలైట్ యాంటీ-నక్సల్ దళం పనితీరు, పరిపాలనా అంశాలపై స‌మీక్ష నిర్వ‌హించారు. గ్రేహౌండ్స్ చేపడుతున్న కార్యాచరణలు, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో వారి పనితీరు, విధుల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అలాగే, సిబ్బంది శిక్షణా ప్రమాణాలు, పాఠ్యాంశాలు, శిక్షణా విధానాన్ని ప‌రిశీలించారు. మారుతున్న ఆపరేషన్ అవసరాలకు అనుగుణంగా శిక్షణను నిరంతరం మెరుగుపరచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత పెంచాలని, ఎల్లప్పుడూ ఉన్నత స్థాయి యుద్ధ సిద్ధతను కొనసాగించాలని గ్రేహౌండ్స్ అధికారులను ఆదేశించారు.

తరచూ ఫైరింగ్ డ్రిల్స్ నిర్వహించడంతో పాటు, దళం ఎప్పుడూ మిషన్ రెడీగా ఉండేలా కఠినమైన శిక్షణా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుతున్న నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలగాల తగ్గింపుపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌కు సంబంధించిన 708 సర్వెండర్డ్ పోస్టుల ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని అధికారులకు తెలిపారు. ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాత నోటిఫైడ్ పోస్టులను తిరిగి భర్తీ చేస్తామని చెప్పారు. ఈ సంద‌ర్భంగా గ్రేహౌండ్స్ సిబ్బంది కృషి, అంకితభావాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

Advertisement
Advertisement