త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta | యాద‌గిరిగుట్టకు పోటెత్తిన భ‌క్తులు.. ఉచిత ద‌ర్శ‌నానికి రెండు గంట‌లు

Yadagirigutta | వ‌రుస‌గా రెండు, మూడు రోజులు సెలవులు వ‌చ్చిందంటే చాలు.. రాష్ట్రంలోని ప్ర‌తి ఆల‌యం కూడా భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడిపోతోంది. తెలంగాణలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం యాద‌గిరిగుట్ట శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యానికి కూడా భ‌క్తులు భారీ సంఖ్య‌లో పోటెత్తారు.

S

Telangana | Published On Mar 14, 2026, 4.18 pm IST

Yadagirigutta | యాద‌గిరిగుట్టకు పోటెత్తిన భ‌క్తులు.. ఉచిత ద‌ర్శ‌నానికి రెండు గంట‌లు
Advertisement

Yadagirigutta | త్రినేత్ర‌.న్యూస్ : వ‌రుస‌గా రెండు, మూడు రోజులు సెలవులు వ‌చ్చిందంటే చాలు.. రాష్ట్రంలోని ప్ర‌తి ఆల‌యం కూడా భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడిపోతోంది. తెలంగాణలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం యాద‌గిరిగుట్ట శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యానికి కూడా భ‌క్తులు భారీ సంఖ్య‌లో పోటెత్తారు. ఇవాళ రెండో శ‌నివారం సెలవు దినం కావ‌డంతో.. భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. స్వామి వారి ఉచిత ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి రెండు గంట‌లు, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి ఒక గంట స‌మ‌యం ప‌డుతోంది. ఆర్జిత సేవ‌లు, నిత్య పూజ‌ల్లో భ‌క్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
Advertisement