Bhatti Vikramarka | ఫ్యూడల్ శక్తులు మళ్లీ ఏకమవుతున్నాయి.. భట్టి కీలక వ్యాఖ్యలు
Bhatti Vikramarka | రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తులు మళ్లీ ఏకమవ్వాలని చూస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బహుజనులందరూ ఐక్యంగా నిలిచి సామాజిక న్యాయం అందించే ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తులు మళ్లీ ఏకమవ్వాలని చూస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బహుజనులందరూ ఐక్యంగా నిలిచి సామాజిక న్యాయం అందించే ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో భట్టి విక్రమార్క పాల్గొని ఆ మహనీయునికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పూలే ఆశయాలకు అనుగుణంగా, అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం మన ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పు లక్ష్యంగా బడ్జెట్‌లో విద్యాశాఖకు 13.5 శాతం నిధులు కేటాయించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో సకల సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. వారి ఆరోగ్యం, పోషణ దృష్ట్యా డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచాం. జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం అని భట్టి పేర్కొన్నారు.
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలి. అలాగే, 2011 జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ఉనికికే ముప్పు వాటిల్లుతుంది. కుల గణనను ప్రాతిపదికన తీసుకోకుండా విభజన చేస్తే దక్షిణ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



