Bhatti Vikramarka | త్వరలోనే కొత్త పీఆర్సీపై నిర్ణయం : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక రాగానే పరిశీలించి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
పెండింగ్ డీఏలపై కూడా నిర్ణయం తీసుకుంటాం
ఉద్యోగుల రిటైర్డ్ వయసు పెంచడంతో ప్రభుత్వంపై భారం
మెడికల్ బిల్లులు మొత్తం క్లియర్ చేశాం
ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి 1.25 కోట్ల ప్రమాద బీమా
బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులపై ఆంక్షలుండేవి
ప్రజా పాలనలో ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాం
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక రాగానే పరిశీలించి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారు.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు పెండింగ్‌లో పెట్టి వెళ్లిన మూడు డీఏలను మా ప్రభుత్వం చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల భారం తప్పించుకునేందుకు గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును మూడు సంవత్సరాలకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. నాలుగవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడంతో 17వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల భారం ప్రజా ప్రభుత్వంపై పడిందని భట్టి విక్రమార్క తెలిపారు.
పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రతినెల రూ. 700 కోట్లు
ఉద్యోగుల మెడికల్ బిల్లులను మొత్తం క్లియర్ చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి గత ప్రభుత్వం రూ. 40,150 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ విషయంపై సభలో శ్వేత పత్రం విడుదల చేశాం. ఆ బకాయిల్లో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మొత్తం రూ. 4,575 కోట్లు ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రతినెల రూ. 700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. రాబోయే రోజుల్లో బకాయిలు త్వరితగతిన క్లియర్ చేసేందుకు ప్రతినెలా చెల్లించి రూ. 700 కోట్లను రూ. 1000 కోట్లకు పెంచాలని విధానపరమైన నిర్ణయం తీసుకునే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ సభ్యులకు మానవీయ కోణం ఉండటంతోనే ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. మీ ప్రభుత్వ కాలంలో పది సంవత్సరాలపాటు హెల్త్ కార్డుల కోసం ఉద్యోగ సంఘాలు అడిగి అలసిపోయాయి. ప్రమాదవశాత్తు ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి 1.25 కోట్ల ప్రమాద బీమాని అమలు చేయబోతున్నాం. మా ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ. 6,146 కోట్లు క్లియర్ చేశామని భట్టి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై ఆంక్షలు ఉండేవి. మా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిత్యం సంప్రదింపులు చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి మెలిసి పనిచేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఏ సమయంలోనైనా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. వ్యవస్థలు పనిచేయకుండా చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | తెలంగాణకు అదనంగా రూ. 5 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం చేయండి..
మే 20, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Bhatti Vikramarka | ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం
మే 5, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



