Bhatti Vikramarka | భూముల విలువ పెంపుపై అధ్యయనం పూర్తి
Bhatti Vikramarka | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కమిటీల అధ్యయనం పూర్తైందని వాటిని ముందుగా సబ్ కమిటీకి ఆ తర్వాత కేబినెట్‌కు సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
సబ్ కమిటీకి అందిన తర్వాత నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
జీఎస్టీలో 15 శాతం పెరుగుదల
హెచ్ఎండీఏ భూముల వేలంపై గ్లోబల్ ప్రచారం తప్పనిసరి
రెవెన్యూ జనరేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్షలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కమిటీల అధ్యయనం పూర్తైందని వాటిని ముందుగా సబ్ కమిటీకి ఆ తర్వాత కేబినెట్‌కు సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి రెవెన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏఐ సాంకేతికతో, పన్నులపై పర్యవేక్షణతో ఆదాయం పెరిగిందని భట్టి వివరించారు. మైనింగ్, రవాణా శాఖల్లో ఆదాయ వనరులను పెంచుకోగలిగామని, అధికారులు మరింత పకడ్బందీగా పనిచేసి ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వంటి అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఆ భూముల అమ్మకంపై ప్రచారం జరగాలి
పన్ను ల నిర్వహణలో పకడ్బందీ చర్యల మూలంగా కమర్షియల్ టాక్స్ శాఖలో జీఎస్టీ ఆదాయం గత 3 నెలలుగా 15 శాతం పెరుగుదల కనిపించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో పెరుగుదల కనిపించిందని వెల్లడించారు. ఆదాయం వనరులు పెంచుకునేందుకు ప్రతి శుక్రవారం రెవెన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని భట్టి వివరించారు. 2047 వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్న ఆ మేరకు అన్ని శాఖలు ఆదాయ సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ఈ అంశంపై అందరికీ ముందస్తుగా సమాచారం అందడం మూలంగా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.
మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపైన అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, పరిశ్రమల శాఖలోనూ ఆదాయం పెంపునకు సంబంధించి చేపట్టిన చర్యలు ఫలితాలపై మంత్రులు సమీక్ష చేశారు. ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు యాక్షన్ టేకెన్ రిపోర్టుతో తదుపరి సమావేశానికి రావాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



