Bhatti Vikramarka | కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
Bhatti Vikramarka | కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం ప్రకటించిన భారీ బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని భావించామన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.
- బయో ఫార్మా శక్తిలో రాష్ట్రం ఊసే లేదు
- ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్
- సెమీ కండక్టర్ల పరిశ్రమ ఇవ్వలేదు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం ప్రకటించిన భారీ బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని భావించామన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, తాను, సహచర మంత్రులు, ఎంపీలు అనేకసార్లు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికశాఖ మంత్రిని కలిసి రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తులు చేశామని తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, నగర చుట్టూ చేపడుతున్న అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో సహా పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారని ఆశించామన్నారు. బయో ఫార్మా శక్తి పథకానికి రూ.10వేల కోట్లు ప్రకటించారని.. ఫార్మా అనగానే అందరికీ హైదరాబాద్ గుర్తుకు రావాలన్నారు.
అయితే, తెలంగాణలో జీనోమ్ వ్యాలీ ఉందని.. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసునని.. ఇందులో హైదరాబాద్‌కు చోటు కల్పిస్తారని ఆశించినా ఏమీ దక్కలేదన్నారు. కొవిడ్ సమయంలో కీలక ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్ అంటే హైదరాబాద్ అనీ.. అయినా నగరాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేంజ్ ఎకానమీలోనూ హైదరాబాద్‌ను చిన్నచూపు చూశారని ఆరోపించారు. హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్‌గా ఉందని, రీజనల్ మెడికల్ వ్యాల్యూ హబ్‌లో కూడా హైదరాబాద్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధి చెందుతోందని.. రామప్ప ఆలయం, కవ్వాల్ అభయారణ్యానికి నిధులు ఇస్తారని ఆశించామన్నారు. సెమీ కండక్టర్ల పరిశ్రమలకు తెలంగాణ ఎంతో అనుకూలంగా ఉందని, తెలంగాణకు ఒక్క పరిశ్రమైనా కేటాయించాలని మోదీని ఎన్నోసార్లు అడిగామని, ఎన్నిసార్లు అడిగినా ఈ విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.
కేంద్రం పేరు మార్చిన ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేశారన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈ అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నించాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ ఎంపీలు కేంద్రమంత్రిని కలిసి మరోసారి విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. ద్రవ్యలోటును 4శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. కానీ, కేంద్రం ద్రవ్యలోటును 4.3శాతానికి పెంచుకుందని, రాష్ట్రాలకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు, విచారణపై ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఈ అంశంపై తాను మాట్లాడితే సిట్ విచారణను ప్రభావితం చేసినట్లవుతుందన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



