Bhatti Vikramarka | నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | ప్రతి నియోజకవర్గానికి నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గానికి నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తామని అన్నారని పొరపాటుగా వ్యాఖ్యానించారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : ప్రతి నియోజకవర్గానికి నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గానికి నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తామని అన్నారని పొరపాటుగా వ్యాఖ్యానించారు. దీన్ని అదునుగా భావించిన భట్టి విక్రమార్క కలుగజేసుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి నాలుగున్నర లక్ష ఇండ్లు ఇస్తామని చెప్పారు. కానీ నియోజకవర్గానికి నాలుగున్నర లక్ష ఇండ్లు ఎక్కడ ఉంటాయి. ఉంటే 70 వేల వరకు ఉంటాయి. సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించొద్దు.. ఉద్దేశ పూర్వకంగా అన్నారా..? లేక ఫ్లోలో వచ్చిందా..? అన్నది ఆయనకే తెలియాలి. నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నాం. అనేక సార్లు సమావేశాలు పెట్టి అర్హత కలిగిన వారికి ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. వారిలాగా మాయమాటలు చెప్పి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి.. భ్రమలు కల్పించి ఓట్లు దండుకోలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా పేదవాడిని గాలికి వదిలేసి పోయారు. మా మంత్రి నిక్కచ్చిగా రివ్యూ చేస్తూ వారానికోసారి ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను మంజూరు చేయిస్తున్నారు. ఇల్లు లేకుండా పేదవాడు ఉండొద్దనే ఉద్దేశంతో రూ. 22,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇది భారం అవుతున్నప్పటికీ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి అసత్యపు ప్రచారం చేస్తున్నారు. నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తామని మేం ఎక్కడా చెప్పలేదు అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పేదల సంక్షమేం పట్టడం లేదు. మా ప్రభుత్వం మానవీయ కోణంలో పేదల కోసం పని చేస్తుంది. 2014కు ముందు రాష్ట్రంలో లక్షలాది గుడిసెలు ఉండే... వైఎస్సార్ మానవీయ కోణంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇచ్చారు. మీరు పదేండ్లు ఇందిరమ్మ ఇండ్లు లేకుండా చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. పాపం పేదలు పదేండ్లు అన్యాయం అయిపోయారని చెప్పి.. రూ. 5 లక్షలతో మేం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం. ఈ పథకానికి సంబంధించిన కాగితాలను బీఆర్ఎస్ సభ్యులు చింపేశారు. వీరికి పేదల పట్ల ఉన్న నిబద్ధత ఇదేనా..? ఇంకా అవసరమైతే ఇంకో వెయ్యి ఇండ్లు ఇచ్చేందుకు మంత్రి సిద్ధంగా ఉన్నారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






