త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | త‌ప్ప‌కుండా అడ్డు త‌గుల‌తాం.. ప్ర‌తిప‌క్షానికి తేల్చిచెప్పిన‌ డిప్యూటీ సీఎం భ‌ట్టి

Bhatti Vikramarka | అధికార పక్షం, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య శాస‌న‌స‌భ‌లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు ప‌క్షాల స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తీవ్రంగా స్పందించారు.

S

Telangana | Published On Mar 23, 2026, 5.05 pm IST

Bhatti Vikramarka | త‌ప్ప‌కుండా అడ్డు త‌గుల‌తాం.. ప్ర‌తిప‌క్షానికి తేల్చిచెప్పిన‌ డిప్యూటీ సీఎం భ‌ట్టి
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : అధికార పక్షం, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య శాస‌న‌స‌భ‌లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు ప‌క్షాల స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తీవ్రంగా స్పందించారు.

అత్యంత ప్ర‌జాస్వామ్య‌యుతంగా బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రుగుతుంది. హ‌రీశ్‌రావు మాట్లాడుతుంటే మేం ఎవ‌రం డిస్ట‌ర్బ్ చేయ‌లేదు. స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే క్ర‌మంలో ఎక్సైజ్ మంత్రి స‌మాధానం చెప్పారు. అంత‌కు మించి ఎవ‌రూ కూడా హ‌రీశ్‌రావును డిస్ట‌ర్బ్ చేయ‌లేదు. ఇక వారు చెప్పేవన్నీ రాసుకుంటున్నాం. ఇక ప్ర‌తి సంద‌ర్భంలో అడ్డు త‌గులుతున్నారంటే కొన్ని సంద‌ర్భాల్లో అడ్డు త‌గ‌ల‌క త‌ప్ప‌దు. ఎందుకంటే హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్‌లో ఆదాయం త‌గ్గింద‌ని చెప్పారు. అది పూర్తిగా త‌ప్పు. స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం స‌రికాదు. నేను చెబుదామనుకున్న కానీ ఆగ‌ను. స‌రిదిద్దుకోక‌పోతే ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు స‌మాచారం వెళ్తుంది. కాబ‌ట్టి క‌ల‌గ‌జేసుకోవ‌డం త‌ప్ప‌ద‌ని భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు.

మేం ఆ త‌ప్పు చేయ‌లేదు..

రిజిస్ట‌ర్రేష‌న్ డిపార్ట్‌మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో 14250 కోట్లు వ‌స్తే వేరే ర‌కంగా త‌గ్గిపోయింద‌ని చెబుతున్నారు. గ‌త ప్ర‌భుత్వం.. 2020 నుంచి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటికీల‌కు, కార్పొరేష‌న్ల‌కు చెల్లించాల్సిన డ్యూటీని మీరు పూర్తిగా చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలోనే చూపించారు. కానీ మేం ఆ త‌ప్పు చేయ‌లేదు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన డ‌బ్బుల‌ను చెల్లిస్తున్నాం. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం 5740 కోట్లు మున్సిపాలిటీ, కార్పొరేష‌న్ల‌కు అడ్జ‌స్ట్ చేశాం. కాబ‌ట్టి త‌క్కువ‌గా క‌న‌బ‌డుతుంది. వాస్త‌వానికి మొత్తం రెవెన్యూ 14 వేల 250 కోట్లు అని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

అలాంట‌ప్పుడు త‌ప్ప‌కుండా క‌ల్పించుకోవాల్సి ఉంటుంది..

గ‌త ప్ర‌భుత్వంలో మున్సిపాలిటీల‌ను నిర్ల‌క్ష్యం చేశారు. మీరు చేసిన త‌ప్పిదాల‌ను స‌రిదిద్ది స‌భ ముందు పెడుతున్నాం. వాస్త‌వాల‌ను స‌భ‌ ముందు ఉంచుతున్నాం. దాన్ని కూడా మీరు త‌ప్పుగా చూపించి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. అలాంట‌ప్పుడు త‌ప్ప‌కుండా క‌ల్పించుకోవాల్సి ఉంటుంది అని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

వాయిదా వేసిన మాట వాస్త‌వ‌మే..

రెండున్న‌ర గంట‌లు కూర్చోబెట్టార‌ని త‌ల‌సాని అన్నారు. వాయిదా వేసిన మాట వాస్త‌వ‌మే. వాయిదాకు కార‌ణం ఉంది. ఈ రాష్ట్రంలో ఉద్యోగ‌స్తుల కోసం ప్ర‌మాద బీమా తీసుకొచ్చాం.. ఎన‌ర్జీ డిపార్ట్‌మెంట్‌లో ఆ స్కీం ప్రారంభించాం. ప్ర‌మాద‌వ‌శాత్తు లైన్‌మెన్, ఆర్జిజ‌న్ మ‌ర‌ణిస్తే.. వారికి కోటి విలువ చేసే బీమా చెక్కుల‌ను అంద‌జేశాం. వారికి అసెంబ్లీ క‌మిటీ హాల్ 1లో ఆ కుటుంబ స‌భ్యుల‌ను పిలిచి భ‌రోసా క‌ల్పించి చెక్కుల‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించాం. అందుకే స‌భ‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement