త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | మీకు మొగోళ్లవ‌స‌రంలే.. ఆడోళ్ల‌తోనే చిత్తు చిత్తు కొట్టిస్తా

Konda Surekha | ఊడిపోయే ప‌ద‌వుల్ల ఉన్నోళ్లు మా ముందు కుప్పిగంతులేస్తే ఊకోమ‌ని.. వాళ్ల‌ను ఆడోళ్ల‌తోటే కొట్టిస్తామ‌ని మాజీ మంత్రి, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మావోళ్ల‌ మీద ఈగ వాలినా మంచిగుండ‌ద‌న్నారు.

S

Telangana | Published On Sep 29, 2026, 5.45 pm IST

Konda Surekha | మీకు మొగోళ్లవ‌స‌రంలే.. ఆడోళ్ల‌తోనే చిత్తు చిత్తు కొట్టిస్తా
Advertisement
  • నా ఎన్కున్నోళ్లే సాలు.. ఒక్కొక్క‌ళ్లు న‌లుగుర్ని కొడ్త‌రు
  • ఇప్ప‌ట్కైనా నోరు ద‌గ్గెర వెట్టుకోర్రి.. లేకుంటే ఎక్క‌డ దొర్కితే అక్క‌డ్నే కొడ్త‌రు
  • మావోళ్ల మీద ఈగ వాలినా ఊకోం ఇగ‌
  • మ‌రోసారి గట్టి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ

Konda Surekha | త్రినేత్ర న్యూస్: ఊడిపోయే ప‌ద‌వుల్ల ఉన్నోళ్లు మా ముందు కుప్పిగంతులేస్తే ఊకోమ‌ని.. వాళ్ల‌ను ఆడోళ్ల‌తోటే కొట్టిస్తామ‌ని మాజీ మంత్రి, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మావోళ్ల‌ మీద ఈగ వాలినా మంచిగుండ‌ద‌న్నారు. మిమ్మ‌ల్ని కొట్ట‌నీకి మొగోళ్లే అవ‌స‌రం లేద‌ని.. నా ఎన్కున్న ఆడోళ్లే సాల‌న్నారు. ఇప్పట్కైనా నోరు దగ్గెర వెట్టుకోకుంటే ఎక్క‌డ దొర్కితే అక్క‌డ్నే కొడ్తార‌ని హెచ్చరించారు. వ‌రంగ‌ల్‌లో మంగ‌ళ‌వారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్ల అన్ని స్థానాలల్ల గెల్వాల‌ని సూచించారు.

పుసుక్కున్న ఎవ‌ర్న‌న్నా అంటే..

రెండ్రోజులైతే ఊశిపోయేటోళ్లు (ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య) ఒకలున్న‌రు. నిన్నగాక మొన్న ఎక్కినోళ్లు (కుడా ఛైర్మెన్ గుండు సుధారాణి) ఒక‌లున్న‌రు. నిన్న‌గాక మొన్న ఎక్కినోళ్లు అస‌లైనోళ్లా.. లేక డూబ్లికేటా మీరే ఆలోచించుకోర్రి. ఇంకోసారి మా ముందు కుప్పిగంతులేస్తే ఊర్కునేది లేదు. మిమ్ముల కొట్ట‌నీకి మొగోళ్లు అవ‌స‌రంలే.. ఆడోళ్లే కొడుత‌రు. నా ఎన్క నిల‌వ‌డ్డోళ్లే సాలు.. ఒక్కొక్క‌ళ్లు న‌లుగుర్ని కొడ్త‌రు. అంత ద‌మ్ము, ధైర్యమున్నోళ్లు ఉన్న‌రు. నోరు జారీ పుసుక్కున ఎవ‌ర్న‌న్నా అంటే మాత్రం ఎక్క‌డ దొర్కితే అక్క‌డ్నే చిత్తు చిత్తు కొట్టి ఒదిలిపెడ్త‌రు. ఇప్ప‌టికైనా నోరు దగ్గెరవెట్టుకొని ఉండుర్రి. ఇక‌ముందు కొండా దంప‌తుల‌కు చెందిన వ్య‌క్తుల మీద ఈగ వాలినా ఊర్కునేది లేదు.

24 గెల్వాలే..

పార్టీకి, నాయ‌క‌త్వానికి న‌ష్టం చేయొద్దు. లేకుంటే గ‌ట్టిగ బుద్ధి చెప్తం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లొస్తున్న‌య్‌. మ‌న మ‌ధ్య‌ల ఏమున్నా మ‌ర్సిపోవాలే. అంద‌రం క‌ల్సి పోరాడి ఎన్నిక‌ల్ల గెల్వాలే. మొత్తం 24 స్థానాలు గెల్చేట‌ట్టు ప్లాన్ ఏసుకోవాలే. కేంద్రం పైస‌లిస్తే వ‌రంగ‌ల్ కోట‌లో బ‌య‌ట‌వ‌డ్డ 11 ఆలయాల‌ను అభివృద్ధి చేస్కోవ‌చ్చు. మొన్న ఎంజీఎంలో బీఆర్ఎస్ నేత‌లే ఆగ‌మాగం చేసి రాజ‌కీయం చేయ‌డం బాధ‌నిపించింది.

అంద‌ర్తో మంచిగ‌నే ఉంటున్న‌..

మంత్రి ప‌ద‌వి పోయింద‌నే బాధేం లేదు. ఇప్పుడు గూడా అంద‌రితో మంచిగ‌నే ఉంటున్న. నా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చేస్తా. అన్ని డివిజ‌న్ల నాయ‌కుల‌తో మాట్లాడ్తా. ప‌నుల మీద‌నే ద్యాస వెడ్తా. ఊడిపోయే ప‌ద‌వుల్లో ఉన్నోళ్లు క‌త్తులు తిప్పాల‌నుకుంటుండ్రు అని సురేఖ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement