త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | అడ్డుకుంది బిల్లును కాదు.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని: ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌

Eatala Rajender | మహిళా బిల్లుకు వ్య‌తిరేకంగా విప‌క్షాలు ఓటు వేయ‌డంపై మ‌ల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Eatala Rajender) మండిప‌డ్డారు. అడ్డుకున్నది బిల్లును కాదు.. ఆడ‌బిడ్డ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని అంటూ విప‌క్షాలపై ధ్వ‌జ‌మెత్తారు. ఇది భారత చరిత్రలో ఒక చీకటి దినమ‌ని, మహిళా హక్కులపై ప్రతిపక్షాల గొడ్డలిపెట్టు అంటూ ఎక్స్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On Apr 18, 2026, 6.36 am IST

Eatala Rajender | అడ్డుకుంది బిల్లును కాదు.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని: ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌
Advertisement

Eatala Rajender | త్రినేత్ర‌.న్యూస్‌: చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు (Women's Reservation Bill) క‌ల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన 131వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు వ్య‌తిరేకంగా విప‌క్షాలు ఓటు వేయ‌డంపై మ‌ల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Eatala Rajender) మండిప‌డ్డారు. అడ్డుకున్నది బిల్లును కాదు.. ఆడ‌బిడ్డ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని అంటూ విప‌క్షాలపై ధ్వ‌జ‌మెత్తారు. ఇది భారత చరిత్రలో ఒక చీకటి దినమ‌ని, మహిళా హక్కులపై ప్రతిపక్షాల గొడ్డలిపెట్టు అంటూ ఎక్స్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

`మహిళా సాధికారత గురించి వేదికల మీద గంభీర ఉపన్యాసాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ (Congress), 'ఇండియా' కూటమి (INDIA block) నాయకులారా.. మీ అసలు రంగు నేడు పార్లమెంటు సాక్షిగా బయటపడింది. మహిళా శక్తి వందన అధినియం (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు పట్ల మీ వైఖరి చూస్తుంటే, మీది 'ఇండియా' కూటమి కాదు, ఒక మహిళా వ్యతిరేక కూటమి అని స్పష్టమవుతోంది. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని మోదీ (PM Modi) తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని అడ్డుకోవడం అక్షరాలా మహిళలకు మీరు చేసిన ద్రోహం.

విపక్షాల మొండి వైఖరి వల్ల నేడు దేశ మహిళలు తమ హక్కులను కోల్పోయారు. అడ్డుకుంది బిల్లును కాదు.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి కుంటి సాకుకు, ప్రతి ప్రశ్నకు నిండు సభలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అత్యంత స్పష్టతతో సమాధానమిచ్చారు. అయినా సరే, కేవలం రాజకీయ లబ్ధి కోసం, క్రెడిట్ రాకూడదనే అక్కస్సుతో ఈ బిల్లును అడ్డుకోవడం చూస్తుంటే, కాంగ్రెస్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది.

విచ్ఛిన్నకర రాజకీయాలే వారికి ముఖ్యం

అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం: దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, మహిళా బిల్లును కేవలం ఎన్నికల మేనిఫెస్టోలకే పరిమితం చేసింది తప్ప, చిత్తశుద్ధితో అమలు చేయలేదు.

పదే పదే అదే కుట్ర: మహిళా హక్కులకు తూట్లు పొడవడం కాంగ్రెస్‌కు, వారి మిత్రపక్షాలకు ఇది మొదటిసారి కాదు.. ఇది వారు ప్లాన్ ప్రకారం రిపీటెడ్‌గా చేస్తున్న కుట్ర.

నేడు అడుగడుగునా ఆటంకాలు: మోదీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన అడుగు వేస్తుంటే, మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డుతగలడం వీరి ద్వంద్వ నీతికి నిదర్శనం.

కుట్రల కూటమి: 'ఇండియా' కూటమి నాయకులకు మహిళల అభివృద్ధి కంటే తమ రాజకీయ మనుగడే ముఖ్యమని నేటి ఘటనతో స్పష్టమైంది. మహిళలకు ద్రోహం చేయడంలో వీరంతా ఏకమయ్యారు.

మహిళా శక్తికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు, కాంగ్రెస్ కూటమికి రాబోయే 2029 ఎన్నికల్లో దేశంలోని ప్రతి ఆడబిడ్డ తగిన గుణపాఠం చెప్పడం ఖాయమ‌ని ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌ స్ప‌ష్టం చేశారు.

 

 

Advertisement
Advertisement